Hyundai Inster EV: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కార్లు వస్తున్నాయి అలాగే కొన్ని బైక్స్ వస్తున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో… పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. చాలామంది వాహనదారులు ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. Hyundai Inster EV
Hyundai unveils Inster EV for global market 355 km
దానికి తగ్గట్టుగానే వాహనాల కంపెనీలు రకరకాల ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువస్తున్నాయి. తక్కువ ధరలో… అలాగే డిస్కౌంట్ ఇస్తూ కూడా కొన్ని వాహనాలు మార్కెట్ లోకి రావడం జరుగుతుంది. అయితే…ఈ తరుణంలో దక్షిణ కొరియాకు చెందిన ఆటో మేజర్ హుందాయి కంపెనీ… కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. హుందాయి ఇన్ స్టర్ పేరుతో కొత్త వాహనాన్ని తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. Hyundai Inster EV
Also Read: BSA Gold Star: రాయల్ ఎన్ఫీల్డ్ కు పోటీగా సరికొత్త బైక్.. ధర, ఫీచర్స్ ఇవే ?
అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ కారును ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తున్నారనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ ఏడాది చివర్లో దక్షిణకొరియా, యూరప్ అలాగే మిడిల్ ఈస్ట్, అంతేకాకుండా ఆసియా పసిఫిక్ మార్కెట్లలో మాత్రం రాబోతుందని తెలిపింది. ఇక ఈ కారు ధర అలాగే ఫీచర్స్ ఒకసారి పరిశీలిద్దాం. హుండాయ్ ఎలక్ట్రిక్ కారు క్యాబిన్లో మనకు 10.25 అంగుళాల డిస్ప్లేను అందిస్తున్నారు. టచ్ స్క్రీన్ విత్ నావిగేషన్ కూడాఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. Hyundai Inster EV
ఈ hyundai కార్లు 42 కిలోవాట్ల బ్యాటరీతో…అంతేకాకుండా 49 కిలోమీటర్ల బ్యాటరీ తో కూడా వస్తున్నాయి. అంటే ఇక్కడ రెండు మోడల్ కార్లు రాబోతున్నాయి అన్నమాట. ఈ రెండు మోడల్ కార్లలో కూడా సింగిల్ మోటార్ ఉంటుందని చెబుతోంది ఈ కంపెనీ. ఇక ఈ కారుకు ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 355 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే.. 30 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ ఎక్కుతుందట కారు. స్టాండర్డ్ కారుతో పాటు 11 కిలోవాట్ల చార్జర్ కూడా మనకు అందిస్తున్నారట.