Income Tax: టాక్స్ పే చేసే వాళ్ళు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయటానికి ఇదే సరైన సమయం ఇప్పటికే లక్షల మంది తమ రిటర్న్స్ ని దాఖలు చేసి రిఫండ్ కోసం చూస్తున్నారు ఇలా రిటర్న్స్ పూర్తి చేసిన చాలా మంది టాక్స్ పేయర్లకు రిఫండ్ కి సంబంధించి మొబైల్ ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయి. అదే విధంగా ఐటీ రిఫండ్ కోసం మీకు ఏదైనా మెసేజ్ వచ్చిందా లేదంటే అకౌంట్ నెంబర్ ఇతర సమాచారం వెరిఫికేషన్ వివరాలు అడిగారా అలాంటి సందేశాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు హెచ్చరికలు చేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది పన్ను చెల్లింపుదారులకు రిఫండ్ వచ్చినట్లు ఫోన్లకు సందేశాలు వస్తున్నాయి.

Income Tax fraud alert

మీ ఐటిఆర్ రిఫండ్ అప్లికేషన్ అప్రూవ్ అయింది. మీకు 15,490 రిఫండ్ వస్తుంది త్వరలో ఈ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతాయి. మీ అకౌంట్ నెంబర్ ని ఒకసారి వెరిఫై చేసుకోండి అని ఇలా మెసేజ్ వస్తుంది. ఇది మీ అకౌంట్ కానట్లయితే లింక్ పై క్లిక్ చేసి మీ అకౌంట్ వివరాలను అప్డేట్ చేయండి అని ఒక వెబ్ లింక్ తో మెసేజ్ వస్తోంది. ఈ విషయం పై టాక్స్ పేయర్లను అప్రమత్తం చేస్తున్నారు.

Also read: Tasty Teja: డ్రైవింగ్ చేస్తూ అవేం పనులు భయ్యా.. టేస్టీ తేజ పై ఫైర్ అవుతున్న నెటిజన్స్..!

ఇన్కమ్ టాక్స్ నుండి వచ్చిందనే భ్రమలో ఫోన్లకు వచ్చే మెసేజ్లలో ఉండే లింక్ ని ఓపెన్ చేస్తున్నారు ఇంక అంతే అకౌంట్ ఖాళీ అవుతోంది. అలాంటి ఏ లింక్స్ ని కూడా ఓపెన్ చేయద్దు. ఏదైనా అనుమానం ఉంటే పోలీసులకి సమాచారం ఇవ్వాలి అలాగే ఇన్కమ్ టాక్స్ అధికారి వెబ్సైట్ ద్వారా రిఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవాలని వారు సూచిస్తున్నారు ఇది ఒక కొత్త రకం. బ్యాంకు మోసం మెసేజ్ లలో ఉండే లింకులని క్లిక్ చేయకండి అప్రమత్తంగా ఉండాలి నీ సన్నిహితులు స్నేహితులు బంధువులకు ఈ మెసేజ్లు ఫార్వర్డ్ చేసి వారిని అప్రమత్తం చేయండి (Income Tax).