IND vs NZ 2024: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ జట్టుపై టెస్ట్ సిరీస్ అలాగే టి20 ఫార్మేట్ లో… అదరగొట్టిన టీమిండియా ఇప్పుడు… న్యూజిలాండ్ ను చీల్చి చెండాడేందుకు రెడీ అవుతోంది. స్వదేశంలో మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో కచ్చితంగా టీమిండియా కు అడ్వాంటేజ్ ఉంటుంది. న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మూడు టెస్టుల సిరీస్ జరగనుంది. IND vs NZ 2024
IND vs NZ 2024 Schedule, Squads, Live Streaming Online
ఇందులో మొదటి టెస్ట్ బెంగళూరు వేదికగా జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించాలంటే కచ్చితంగా ఈ సిరీస్ లో టీమిండియా గెలవాలి. అప్పుడే ఫైనల్ కు వెళుతుంది. ప్రస్తుతానికి అయితే డబ్ల్యూటీసి పాయింట్స్ టేబుల్ లో టీమిండియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత… ఆస్ట్రేలియా ఉన్న సంగతి తెలిసిందే. IND vs NZ 2024
Also Read: Ratan Tata: రూ.2500 కోట్లు పెట్టి ఐపీఎల్ ను నిలబెట్టిన రతన్ టాటా?
ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ లు… మొదటి టెస్ట్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ మూడు టెస్టులు ఫ్రీగా చూడాలంటే… జియో సినిమా చూడాల్సిందే. మొబైల్ యాప్ జియో సినిమా ద్వారా… మనం ఈ మ్యాచ్లను ఉచితంగా చూడవచ్చు. ఇక స్పోర్ట్స్ 18 ఛానల్ లో కూడా మనం టీవీలో చూడవచ్చు. IND vs NZ 2024