Game Changer: సినిమా పరిశ్రమకు ఆగస్ట్ 15 చాలా ఆసక్తికరమైన రోజు. ప్రతి సంవత్సరం ఆ వారాంతంలో బ్లాక్‌బస్టర్ సినిమాలు విడుదల అవుతుంటాయి. ఈసారి అదే తేదీన పుష్ప-2 లాంటి పెద్ద సినిమా విడుదల కాబోతుంది. దీంతో ఈ సినిమా కోసం భారతీయ సినీ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూశారు. ఇండియా అంతటా ఈ సినిమా భారీ స్థాయి లో బజ్ క్రియేట్ చేయడంతో స్వాతంత్ర్య దినోత్సవ వారాంతంలో కలెక్షన్లు జోరుగా ఉంటాయి అని అందరు భావించారు. కానీ పుష్ప-2 అనూహ్యంగా ఈ తేదీని మిస్ చేసుకుని డిసెంబర్‌కి రీషెడ్యూల్ అయింది.
Indian 2 Release effect on Ramcharan Game changer
దాంతో ఆగస్ట్ 15 స్లాట్ ఖాళీ అయిపొయింది. దాంతో ఈ స్లాట్ లో పెద్ద సినిమాలేవైనా దక్కించుకుంటాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఇప్పటి వరకు ఏ పెద్ద సినిమా కూడా ఆ డేట్‌ను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయలేదు. తెలుగులో రామ్ హీరో గా తెరకెక్కిన సినిమా “డబుల్ స్మార్ట్” ఆగస్ట్ 15న విడుదల కానుంది. అయితే ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తే భారతీయుడు-2కి మంచి ఆదరణ లభిస్తుందని కొందరు భావిస్తున్నారు. వారు కూడా ఈ దిశగానే ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే అన్నీ ఆలోచించి ఆగస్ట్ 15న రిలీజ్ చేయొద్దనే నిర్ణయాన్ని ఇండియన్-2 టీమ్ వదులుకుంది. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేయనున్నారు. ఈ మేరకు యూఎస్ ప్రీమియర్ బుకింగ్స్ కూడా ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కూడా ధృవీకరించింది. వాస్తవానికి జూన్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమా నెల రోజుల పాటు వాయిదా పడిపోయింది.
భారతీయుడు-2 జులై 12న విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ వాయిదా పడితే ఆసక్తి తగ్గుతుందని భావిస్తున్నారు. అందుకే ఈ సినిమా ను మళ్ళీ వాయిదా పడలేదు. ఒక వేళా మళ్ళీ వాయిదా పడితే ఈ సినిమా శంకర్ చేస్తున్న తదుపరి సినిమా గేమ్ చంగెర్ పై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. రామ్ చరణ్ కెరీర్ లోనే పెద్ద సినిమా అయినా గేమ్ ఛేంజర్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. రామ్ చరణ్ కి కూడా ఈ సినిమా హిట్ ఎంతో ముఖ్యం.(Game changer)