IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలానికి రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు కొంతమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఇక మిగతా ప్లేయర్లను కొనుగోలు చేసుకోవడానికి మెగా వేలాన్ని నిర్వహించనున్నారు. నవంబర్ 24, 25వ తేదీలలో జెడ్డా వేదికగా నిర్వహించనున్నారు BCCI ఆఫీసర్స్. దీనికోసం ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు అంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. స్టార్ ప్లేయర్ల నుంచి యంగ్ ప్లేయర్ల వరకు ప్రతి ఒక్కరూ వేలం కోసం ఆసక్తిగా ఉన్నారు. అత్యధిక ధర ఎవరికి వస్తుందా అని చూస్తున్నారు. కాగా అమ్ముడవ్వని కొంతమంది ప్లేయర్ల కూడా ఉన్నారు. ఈ లిస్ట్ ఒకసారి చూస్తే…! IPL 2025 Auction
IPL 2025 Auction These are the Unsold Players in IPL Auction
అజింక్య రహానే
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రీఎంట్రీ ఇచ్చిన మోస్ట్ పవర్ఫుల్ అజింక్య రహానే 2024లో ఫెయిల్ అయ్యాడు. దీంతో 2025లో ఏ జట్టు కూడా రహానేపై ఆసక్తి చూపించడం లేదు.
ఇషాంత్ శర్మ
ఇషాంత్ కూడా 2025 ఐపీఎల్ లో అమ్ముడుపోకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ తరఫున తొమ్మిది మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టాడు. ఇతనికి తన వయసే పెద్ద ఆటంకంగా మారుతుంది.
Also Read: Sanju Samson: ఈ అమ్మాయితో సంజు శాంసన్ కు టార్చర్ ?
ఉమేష్ యాదవ్
గుజరాత్ టైటాన్స్ మాజీ ప్లేయర్ ఉమేష్ యాదవ్ ను ఏ జట్టు కూడా కొనుగోలు చేయకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఉమేష్ 7 మ్యాచుల్లో 8 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో ఇతడు ఈ సంవత్సరం ఖాళీగానే ఉండే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
Also Read:
సర్ఫరాజ్ ఖాన్
టీమిండియా తరఫున టెస్టుల్లో సర్ఫరాజ్ ఖాన్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్ 2025లో ఫ్రాంచైజీలను ఆకట్టుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డాడు.
మోహిత్ వర్మ
గుజరాత్ టైటాన్స్ తరఫున 2023లో మోహిత్ వర్మ తన ఆట తీరుతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. ఇక 14 మ్యాచుల్లో 27 వికెట్లు పడగొట్టాడు. 2024లో కేవలం 13 వికెట్లు మాత్రమే పడగొట్టి పేలవ ఫామ్ తో మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. IPL 2025 Auction