IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలం జరగనుంది. ఇప్పటికే వేలం నిర్వహణపై ఫోకస్ పెట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి రిటెన్షన్ రూల్స్ ను ఏర్పాటు చేస్తోంది. 10 ఫాంచైజీల ఓనర్లతో సమావేశమైనటువంటి బీసీసీఐ వారు ఇచ్చే సలహాలు, సూచనలను కూడా స్వీకరిస్తుంది. IPL 2025
IPL 2025 Jasprit Bumrah in RCB Mumbai fans in shock
మెగా వేలం నేపథ్యంలో జట్లు అన్ని పూర్తిగా మారిపోనున్నాయి. ఆటు ముంబై ఇండియన్స్ స్టార్ పెసర్ జస్ప్రీత్ బుమ్రా ఆ జట్టును వీడనున్నారని కొన్ని రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. IPL 2025
Also Read: IPL 2025: IPL 2025కి ముందు ప్రమాదంలో పడ్డ ముంబై ?
రోహిత్ శర్మ అనంతరం టీమ్ ఇండియా సారథ్య బాధ్యతలను స్వీకరించాలనే ఉద్దేశంతోనే జస్ప్రీత్ బుమ్రా ఉన్నట్లు ఈ ఇంటర్వ్యూలో స్పష్టం అయ్యింది. పేస్ బౌలర్లు కేప్టెన్ గా సక్సెస్ సాధించారని జస్ప్రీత్ బుమ్రా చెప్పారు. IPL 2025
కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ సారధులుగా ప్రపంచకప్ గెలిచారని, ఆస్ట్రేలియా సారధి ప్యాట్ కమిన్స్ కూడా ప్రపంచకప్ సాధించాలని గుర్తు చేశారు. జస్ప్రీత్ బుమ్రా వాక్యాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ టీమిండియా సారధ్య బాధ్యతలను స్వీకరించాలని ఉద్దేశంతోనే జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడనే విషయం వెళ్లడైంది. IPL 2025