IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి ఫ్రాంచైజీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ లో మెగా వేలం జరగనుండగా ….ఫ్రాంచైజీలన్నీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా వేలం నిర్వహణపై ఫోకస్ పెట్టనుంది. IPL 2025
IPL 2025 Tilak Verma to Sunrisers Hyderabad
ఇప్పటికే ఫ్రాంచైజీలతో సమావేశం నిర్వహించి వారి సలహాలు, సూచనలను పాటిస్తోంది. అయితే రిటెన్షన్ పాలసీని ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు. గత మెగా వేలం రూల్స్ ప్రకారం ప్రతి జట్టు గరిష్టంగా నలుగురు నుంచి ఐదుగురి ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. IPL 2025
Also Read: Hardik Pandya: పాండ్యా- నటాషా విడాకుల వెనుక సీక్రెట్..పేరుకే పెళ్లాం.. ముద్దు లేదు, మురిపం లేదు?
ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలన్నీ రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాతో పాటు వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లపై ఫోకస్ పెట్టనున్నాయి. తెలుగు తేజం, హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మపై సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కన్నేసినట్లుగా సమాచారం. IPL 2025
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ముంబై తరపున మెరుగైన ప్రదర్శన చేసి భారత జట్టు తరుపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అయితే మెగా వేలం రూల్స్ ప్రకారం తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే పరిస్థితి లేద సమాచారం. అందుకే హైదరాబాద్ కు తిలక్ వర్మ వస్తాడని అంటున్నారు.. IPL 2025