Trisha: ఏంటి త్రిష విడాకులు తీసుకున్న సింగర్ ని పెళ్లి చేసుకోబోతుందా..ఇంతకీ ఆ సింగర్ ఎవరు.. నిన్న మొన్నటి వరకు విజయ్ ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తాలు వచ్చిన త్రిష గురించి సడన్గా పెళ్లైన విడాకులు తీసుకున్న సింగర్ తో పెళ్లి అంటూ వార్తలు ఎందుకు వస్తున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.. త్రిష పెళ్లి వార్తలు మీడియాలో ఎప్పుడూ హాట్ టాపికే.. ముఖ్యంగా చెప్పాలంటే త్రిష పెళ్లి చేసుకునే వరకు కూడా ఇండస్ట్రీ జనాలు ఆమె పెళ్లి టాపిక్ తీసుకురాకుండా ఉండలేరు.
Is it true that Trisha married a divorced singer
కానీ త్రిష మాత్రం పెళ్లంటేనే పది అడుగుల దూరంలో ఉంటుంది. అయితే అలాంటి త్రిష విడాకులైన సింగర్ ని పెళ్లాడబోతుంది అంటూ ఇండస్ట్రీలో మరో రూమర్ చక్కర్లు కొడుతోంది. ఇక ఆ సింగర్ ఎవరో కాదు ర్యాప్ సింగర్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న నోయల్.ఈయన కేవలం సింగర్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు.అయితే అలాంటి నోయల్ నటి ఎస్తేర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ పెళ్లయి సంవత్సరం కాకుండానే విడాకులు తీసుకున్నారు.(Trisha)
Also Read: Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ కి కూతురే కాదు కొడుకు కూడా.. పెళ్లి కాకుండానే కొడుకు పుట్టాడా..?
ఇక విడాకుల తర్వాత వీరిద్దరికి సంబంధించి ఎన్నో విషయాలు మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే ఒకరి మీద ఒకరు కొన్ని ఇంటర్వ్యూలలో ఫైర్ అయినా సంగతులు కూడా మనకు తెలిసిందే.అయితే అలాంటి సింగర్ నోయల్ తాజాగా పొట్టేల్ మూవీలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ మూవీ విడుదలై హిట్ టాక్ తెచ్చుకోవడంతో నోయల్ అరియానా హోస్ట్ గా చేసిన టాక్ షోలో పాల్గొన్నారు.అయితే ఈ టాక్ షోలో అరియానా నుండి నోయల్ కి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇందులో భాగంగా మీరు హీరోయిన్లలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అని అడగగా.. హీరోయిన్లందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. హీరోయిన్లను పెళ్లి చేసుకుంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే షూటింగ్లకి ఎక్కడికో వెళ్తారు. కనీస ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. లిఫ్ట్ చేసినా కూడా మళ్లీ చేస్తానని చెప్పి కాల్ కట్ చేస్తారు.ఇక ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది అందమైన హీరోయిన్ల పెళ్లిళ్లు అయిపోయాయి. అలాగే త్రిష గారు రోజురోజుకి చాలా అందంగా తయారవుతున్నారు. త్రిష గారినే నేను పెళ్లి చేసుకుంటా అంటూ నోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో త్రిష నోయల్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.(Trisha)