Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో.. భారీ ధర్నా నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి. ఏపీలో జరుగుతున్న హింసకాండ, వైసీపీ నేత రషీద్ హత్య ఘటన గురించి జాతీయవ్యాప్తంగా తెలియజేసేందుకు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా నిర్వహించడం జరిగింది. Jagan

Is Jagan Delhi tour a grand success

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు ధర్నాలో కూర్చున్నారు. దీంతో జాతీయ మీడియా జగన్మోహన్ రెడ్డి ధర్నా వద్దకు వచ్చి హైలెట్ చేసింది. అంతేకాకుండా.. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్ష వద్దకు పలువురు జాతీయ నాయకులు కూడా రావడం జరిగింది. Jagan

Also Read: AP: ఏపీకి కేంద్రం పంగ నామాలు.. అమరావతికి ఇచ్చిన 15 వేల కోట్లు అంతా అప్పు మాత్రమే ?

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్… జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్ష వద్దకు వచ్చారు. ఆయనకు మద్దతు తెలిపి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు అఖిలేష్ యాదవ్. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత… చంద్రబాబు ఇలా వ్యవహరించడం దారుణం అన్నారు. ఇవాళ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రేపు జగన్ మోహన్ రెడ్డి కచ్చితంగా ముఖ్యమంత్రి అయి తీరుతాడని స్పష్టం చేశారు. Jagan

అఖిలేష్ యాదవ్ తో పాటు శివసేన పార్లమెంటు సభ్యులు సంజయ్ రౌత్ కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపి… చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసి… బిజెపికి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. Jagan