Naresh-Pavitra: ఏంటి నరేష్, పవిత్ర లోకేష్ లు నిజంగానే పిల్లల్ని కనబోతున్నారా..ఈ వయసులో పిల్లలు కని ఏం చేస్తారు అని కొంతమంది వీరిపై ఫైర్ అవుతున్నారు.అయితే వీళ్ళు మాట్లాడిన మాటలు వింటే మీరు వీరిని తప్పుగా అర్థం చేసుకున్నారు అనుకుంటారు. మరి నిజంగానే ఈ జంట పిల్లల్ని కనబోతున్నారా.. లేక ఎవరినైనా దత్తత తీసుకోబోతున్నారా..అసలు వీళ్ళు బయట పెట్టిన నిజం ఏంటో ఇప్పుడు చూద్దాం..
Is Naresh Pavitra going to have children
పవిత్ర లోకేష్, నరేష్ ల వ్యవహారం గత ఏడాది ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు రాజ్ తరుణ్, లావణ్య ల వ్యవహారం ఎలా ఉందో అప్పట్లో వీరిద్దరి వ్యవహారం కూడా అలాగే ఉండేది. రోజుకొక ట్విస్ట్ బయటపడేది. కానీ ప్రస్తుతం అదంతా సద్దుమనిగిపోయింది. అయితే చాలామంది వీరిద్దరూ మళ్ళీ పిల్లల్ని కంటారు అని మాట్లాడుకుంటున్నారు. అయితే ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ నరేష్,పవిత్ర లను అడగగా.. (Naresh-Pavitra)
Also Read: Janhvi Kapoor: జాన్వీ కపూర్ వేసుకున్న నెక్లెస్ తో ఓ లగ్జరీ ఇల్లు కొనేయచ్చు..!
మేము ఇప్పుడు పిల్లల్ని కంటే నాకు 80 ఏళ్ళు వచ్చేవరకు నా పిల్లలకు 20 ఏళ్లు ఉంటాయి.అలాంటిది నాకు అవసరమా.. మాకు ఇద్దరికీ పిల్లలు ఉన్నారు. నా పిల్లల్ని పవిత్ర పిల్లలుగా పవిత్ర పిల్లల్ని నా పిల్లలుగా చూసుకుంటాము. అంతేకానీ మళ్లీ పిల్లల్ని కనే ఆలోచన మాకు లేదు.మేము పిల్లల్ని కనడం కోసం దగ్గరవ్వలేదు.
అలాంటి ఉద్దేశం మాకు లేదు.ఒకరికి ఒకరం తోడుగా ఉండడం కోసమే ఇలా కలిసి ప్రేమ,ఆప్యాయతలు ఇచ్చిపుచ్చుకుంటూ జీవితాంతం ఒకరిపై ఒకరం ప్రేమ పెంచుకుంటూ విజయనిర్మల, కృష్ణ గారి లాగే ఉంటాం..అంటూ నరేష్ పవిత్రలు తెలిపారు. అలాగే పవిత్ర ఏం సంపాదిస్తుంది..ఎంత ఆస్తి ఉంది..అనే విషయం నాకు తెలియదు.అలాగే నేను ఎంత సంపాదిస్తున్నాను.. నా ఆస్తి ఎంత అనే విషయం పవిత్రకు తెలియదు. మేము ఈ ఆస్తిపాస్తుల కోసం కాదు కేవలం ప్రేమ అనురాగాల కోసమే భార్యాభర్తలు గా ఉంటున్నాం అంటూ నరేష్ తెలిపారు.(Naresh-Pavitra)