Ajith: ఏంటి హీరో అజిత్ మగాడు కాదా.. అసలు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడింది ఎవరు? అంత పెద్ద పేపర్లో అజిత్ మగాడు కాదు అని రాసిన ఆ జర్నలిస్టు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లపై కాంట్రవర్సీలు ఉండడం చాలా కామన్.అయితే అవి మరీ తీవ్ర రూపం దాల్సితే తప్ప ఆ కాంట్రవర్సీలపై రూమర్లపై సెలబ్రిటీలు స్పందించడానికి ఇష్టపడరు. అయితే కోలీవుడ్ హీరో అజిత్ పై మగాడు కాదు అంటూ అతిపెద్ద రూమర్ ఆయనపై వినిపించినా కూడా ఆయన సైలెంట్ గానే ఉన్నారట.
Is not Ajith a boy Journalist sensational comments
ఇక విషయంలోకి వెళ్తే..అజిత్ కోలీవుడ్ నటుడు అయినప్పటికీ తెలుగులో కూడా ఈయనకి అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఈయన చేసిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ అయినా సందర్భాలు ఉన్నాయి. అయితే అలాంటి అజిత్ షాలినితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాక రెండు మూడు సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. అయితే ఈవిషయంలో కాంట్రవర్సీ తెరలేపేలా తిరైచ్చువై అనే పత్రిక జర్నలిస్టు అసలు అజిత్ అబ్బాయేనా.. ఆయనకు పెళ్ళై రెండు మూడు సంవత్సరాలు అయింది. (Ajith)
Also Read: Nita Ambani Luxurious Watch: కోట్ల విలువైన వాచ్..నీతా అంబానీ ధరించే ఆ వాచ్ ఏకంగా?
ఇంకా పిల్లలు పుట్టడం లేదు.అసలు ఆయన మగాడా కాదా అనే సందేహం ఉంది అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టి వార్త రాసారు. అయితే ఈ వార్త అప్పట్లో పెద్ద వివాదాస్పదం అయింది.కానీ ఈ విషయంపై అజిత్ ఎక్కువగా రియాక్ట్ అవలేదు. అయితే ఎవరైతే అజిత్ పరువు తీసేలా వార్త రాశాడో చివరికి అదే జర్నలిస్టు హార్ట్ ఎటాక్ వచ్చి హాస్పిటల్లో పడితే ఆపరేషన్ చేయడం కోసం 2.5 లక్షలు అవసరం ఉందని తెలుసుకున్న అజిత్ హాస్పిటల్ వెళ్లి మరీ డబ్బులు కట్టారట.
అయితే ఎందుకు మీపై చెడు ప్రచారం చేసిన వ్యక్తికి డబ్బులు ఇచ్చారు అని పి ఆర్ ఓ అడిగితే బలంగా ఉన్న వారితో గొడవ పడొచ్చు కానీ బలహీనంగా ఉన్న వారితో గొడవలు ఎందుకు.. అయినా ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం మంచిది.మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వాలి అని చెప్పారట.ఇక ఈ విషయం మొత్తం తమిళ జర్నలిస్టు పాండియన్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో అజిత్ అభిమానులు ఆయన గొప్పతనం గురించి తెలిసేలా ఈ వీడియో వైరల్ చేస్తున్నారు.(Ajith)