Mehreen: మెహ్రీన్ ఫిర్జాదా టాలీవుడ్ లో ఎఫ్ 2,ఎఫ్ 3, జవాన్, మహానుభావుడు, రాజా ది గ్రేట్, పంతం, కృష్ణగాడి వీర ప్రేమగాథ,కవచం, చాణక్య, ఎంత మంచి వాడవురా, నోటా, అశ్వద్ధామ, మంచి రోజులు వచ్చాయి, పటాస్ వంటి సినిమాల్లో నటించింది.అయితే ఈ హీరోయిన్ తమిళంలో కూడా నటించింది. అయితే సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ఉన్నట్టుండి మెహ్రిన్ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపించాయి.
Is that Kollywood hero who ruined Mehreen marriage
హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడు భవ్య భిష్ణోయ్ తో ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగింది.దాంతో మెహ్రీన్ పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెబుతుందని అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా వారి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది.దానికి కారణం అప్పట్లో ఎన్నో వినిపించాయి. అయితే మెహ్రీన్ పెళ్లయ్యాక సినిమాల్లో నటించకూడదనే కండిషన్ భవ్య భీష్ణోయ్ కి పెట్టారట. (Mehreen)
Also Read: Sushant Singh Rajput: చేతబడి చేసి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని చంపిన హీరోయిన్.. నిజమేనా.?
ఇక ఆ కండిషన్ కి ఒప్పుకున్న మెహ్రిన్ ఆయనకు తెలవకుండా ఓ తమిళ సినిమాలో నటించడానికి ఒప్పుకుందట. ఎందుకంటే పెళ్లికి ఇంకా టైం ఉండడంతో పెళ్లి కంటే ముందే సినిమాని పూర్తి చేయాలి అనుకొని భవ్య బీష్ణోయ్ కి తెలియకుండా హైదరాబాద్ కి వచ్చి సినిమా కోసం ఫోటోషూట్ చేసిందట. అయితే ఈ విషయం తెలుసుకున్న భవ్య భీష్ణోయ్ మెహ్రీన్ ని గట్టిగా అడగడంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయట.
అంతేకాకుండా మెహ్రీన్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఆమెకు సంబంధించి ఏమైనా పర్సనల్ విషయాలు ఆమె సన్నిహితులను అడగడంతో ఈ విషయం తెలిసిన మెహ్రిన్ ఇలాంటి వ్యక్తిని జీవితాంతం భరించడం కష్టం అని భవ్య భీష్ణోయ్ కి బ్రేకప్ చెప్పినట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు.కానీ ఆ కోలీవుడ్ హీరో సినిమాలో నటించడం వల్లే మెహ్రీన్ పెళ్లి చెడిపోయిందనే టాక్ వినిపించింది