Bharateeyudu: భారీ అంచనాల మధ్య ఈరోజు అనగా జూలై 12న విడుదలైన భారతీయుడు 2 మూవీ పై మిశ్రమ స్పందన వస్తుంది. ఈ సినిమా ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోలు వేయడంతో ఈ మూవీ చూసిన జనాలు ట్విట్టర్ వేదికగా రివ్యూలు ఇవ్వడంతో సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆత్రుత చాలా మందిలో ఉంది. ఇక సినిమా బ్లాక్ బస్టరా లేక ఫ్లాపా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. అయితే శంకర్ భారతీయుడు సినిమా తీయడం వెనుక ఒక కారణం ఉందట.ఆ కారణంతోనే ఈ సినిమాని పట్టుబట్టి మరీ తెరకెక్కించారట.
Is this the secret behind Shankar Bharateeyudu making a film
జెంటిల్మెన్ మూవీ తో దర్శకుడి గా ఎంట్రీ ఇచ్చిన శంకర్ మొదటి సినిమాతోనే తన దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో ఇండస్ట్రీకి చాటి చెప్పారు. ఆ తర్వాత వచ్చిన ప్రేమికుడు సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టే.ఇలా భారతీయుడు,జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, స్నేహితుడు, శివాజీ, అపరిచితుడు వంటి ఎన్నో సినిమాలను తీశారు. ఇక ఇప్పటివరకు ఈయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్టే.అలా ఈయన ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమాపై అంచనాలు పెట్టుకోవడం చాలా కష్టం. అసలు ఆ సినిమాలో శంకర్ ఏ విధంగా కథను చూపిస్తాడడో అనే ఆత్రుత చాలా మందిలో ఉంటుంది.(Bharateeyudu)
Also Read: Bharatheeyudu-2: భారతీయుడు- 2 లో అదే హైలెట్.. కానీ ఆ విషయంలో మళ్లీ దెబ్బేసిన శంకర్..?
అయితే తాజాగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన భారతీయుడు 2 మూవీ ఎన్నో అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే భారతీయుడు మూవీ తీయడానికి ప్రధాన కారణం ఆయన కాలేజి రోజుల్లో చదువుకునే సమయంలో కొన్ని సర్టిఫికెట్ల కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగితే లంచం అడిగారట. అయితే ఆ రోజుల్లో 100,50 లంచం అయినా కూడా ఎక్కువ మొత్తమే. కాబట్టి ఆయన నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తీసుకొని భారతీయుడు సినిమాని తెరకెక్కించాలి అనుకున్నారట.
ఇక భారతీయుడు సినిమాలో కూడా లంచం, అవినీతి, అక్రమాలకు సంబంధించిన స్టోరీనే ఉంటుంది. ఈ సినిమాని ముందుగా రజినీకాంత్ తో అనుకున్నప్పటికీ అది కుదరలేదు.ఆ తర్వాత తండ్రి పాత్రలో రాజశేఖర్ కొడుకు పాత్రలో వెంకటేష్ ని తీసుకుందామని భావించినప్పటికీ ఈ కాంబో సెట్ అవ్వకపోవడంతో చివరికి కమల్ హాసన్ డేట్స్ ఇవ్వడంతో ఆయన్నే పెట్టి ద్విపత్రాభినయం చేయించారు. అలా ఈ భారతీయుడు సినిమా తీయడానికి ప్రధాన కారణం తన కాలేజీ రోజుల్లో సర్టిఫికెట్ల కోసం లంచం తీసుకోవడమేనట.(Bharateeyudu)