Vallabhaneni Vamsi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… వైసీపీ నేతలు కేసుల భయంలో ఉన్నారు. ఎప్పుడు ఏ కేసు వేస్తారో? ఎప్పుడు పోలీసులు అరెస్టు చేస్తారో అనే భయం లో అందరూ ఉన్నారు. ఇప్పటికే పెద్దిరెడ్డి, వల్లభనేని వంశీ, కొడాలి నాని, ద్వారంపూడి ఇలాంటి నేతలపైన చంద్రబాబు కూటమి ప్రభుత్వం కేసులు పెట్టింది. ఇంకా చాలామంది నేతలపై కేసులు పెట్టి వేధిస్తోంది. ముఖ్యంగా వల్లభనేని వంశీని టార్గెట్ చేసింది చంద్రబాబు కూటమి సర్కార్. Vallabhaneni Vamsi
Is Vallabhaneni Vamsi hiding in Junior NTR’s guest house
వల్లభనేని వంశీని అరెస్టు చేసేందుకు హైదరాబాద్కు కూడా పోలీసులను పంపించారు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై గతంలో జరిగిన దాడి కేసులో వల్లభనేని వంశీ పై కేసు పెట్టారు చంద్రబాబు టీం సభ్యులు. దీంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు వల్లభనేని వంశీ కోసం వెతుకుతున్నారు. Vallabhaneni Vamsi
Also Read: Vijayasai Reddy: వైసీపీలో బిగ్ వికెట్… అమిత్ షా తో విజయసాయి భేటీ?
ఏపీ ని వదిలి వెళ్ళిన వల్లభనేని వంశీ హైదరాబాదులోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నాడు అనేది మాత్రం క్లారిటీ రాలేదు. దీంతో హైదరాబాద్ లోకి ఎంటర్ అయిన ఏపీ పోలీసులు… వల్లభనేని వంశీ కోసం జల్లెడ పడుతున్నారు. Vallabhaneni Vamsi
అయితే తాజా సమాచారం ప్రకారం వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ హౌస్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ ఊరు అవుతల.. జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన గెస్ట్ హౌస్ ఉందట. అక్కడే వల్లభనేని వంశీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయం ఏపీ పోలీసులకు మాత్రం తెలియ రాలేదు. Vallabhaneni Vamsi