Vijay: ఏంటి విజయ్ విడాకులు తీసుకోని నిజంగానే మూడేళ్లు అవుతోందా.. ఇన్ని సంవత్సరాలుగా ఈ విషయం ఎందుకు బయటపడలేదు.. అసలు విడాకుల వల్లే భార్యతో దూరంగా ఉంటున్నారా అనేది ఇప్పుడు చూద్దాం.. కోలీవుడ్ హీరో విజయ్ తలపతి తన భార్య సంగీతతో విడాకులు తీసుకోబోతున్నారని గత సంవత్సర కాలం నుండి ఎన్ని వార్తలు వినిపిస్తున్నాయో చెప్పనక్కర్లేదు.
Its been three years since Vijay divorce
అయితే గత సంవత్సరం కాదు ఎప్పుడైతే కీర్తి సురేష్ తో ఈయన నటించారో అప్పటినుండే వీరి విడాకుల వార్తలు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ తర్వాత రష్మిక మందన్నాతో సినిమా చేసే సమయంలో కూడా ఈ విడాకుల వార్తలు వినిపించాయి.ఇక ఆ తర్వాత లియో సినిమాలో చేసినప్పుడు ఈ విడాకులు వార్తలు ఎక్కువయ్యాయి. (Vijay)
Also Read: Sumanth: పెళ్లయ్యాక ఆ హీరోయిన్ తో ప్రేమలో పడ్డ సుమంత్.. కానీ.?
ముఖ్యంగా రీసెంట్గా వచ్చిన ది గోట్ మూవీలో త్రిష ఐటెం సాంగ్ చేయడంతో విజయ్ త్రిష రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే పుకారు కోలీవుడ్ మీడియాని కుదిపేసింది.. అయితే వీరి విడాకుల వార్తలు వినిపిస్తున్న వేళ తాజాగా మరో షాకింగ్ విషయం బయటపడింది.
అదేంటంటే.. కోలీవుడ్ నటుడు విజయ్ తలపతి మూడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడని,అందుకే విజయ్ తన భార్య ఎక్కడ కనిపించడం లేదని తెలుస్తోంది. అందుకే రీసెంట్ గా ఆయన పార్టీ పెట్టిన తర్వాత మొదటి భారీ బహిరంగ సభలో కూడా విజయ్ భార్య కనిపించలేదని సమాచారం.ఏది ఏమైనప్పటికీ విజయ్ విడాకులు తీసుకున్నారో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో పుకార్లు మాత్రం రోజుకొకటి వినిపిస్తున్నాయి.(Vijay)