Janhvi Kapoor: జాన్వీ కపూర్.. అనేక చిత్రాలతో, పాన్-ఇండియన్ సినిమా లతో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్. తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఆమె ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. తెలుగు లో దేవర, ఆర్సి 16 చిత్రాలలో నటిస్తోంది జాన్వీ. కొద్దిరోజుల క్రితం అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల పెళ్లిలో హల్చల్ చేసిన జాన్వీ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆమె “ఉలజ్” సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. గత మూడు-నాలుగు రోజులుగా సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరవుతున్న జాన్వీ ప్రస్తుతం అస్వస్థత కు గురైంది.
Janhvi Kapoor hospitalized for Uneasy
దీంతో ఆమె గురువారం ఆస్పత్రిలో చేరిందని, కల్తీ ఆహారం తినడం వల్లే జాన్వీ అస్వస్థతకు గురైందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ వెల్లడించారు. ప్రస్తుతం జాన్వీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల్లో ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జాన్వీ కోలుకునే వరకు ఆమె పనులన్నీ వాయిదా పడినట్లు సమాచారం. దానికి తోడు కొన్ని రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత జాన్వీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాత సినిమా షూటింగ్, ఇతర కార్యక్రమాలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Team India: రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్… 2027 వరల్డ్‌కప్ నుంచి అవుట్ .?
జాన్వీ కపూర్ నటించిన ‘ఉలజ్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. దానికి తోడు సినిమా ప్రమోషన్లో పాల్గొన్న జాన్వీని ప్రతిసారీ పెళ్లి గురించి ప్రశ్నలు అడగడం ఆమె చిరాకు తెప్పించిందని అర్థమవుతోంది. ఈ సినిమా చిత్రీకరణ చాలా నెలల పాటు సాగింది. ఓ వైపు దేవర షూటింగ్ కూడా చేస్తుంది. ఆమె రామ్ చరణ్ మరియు బుచ్చి బాబు ల ప్రాజెక్ట్ లో కూడా కనిపిస్తుంది. ఇది కాకుండా నేచురల్ స్టార్ నాని కొత్త సినిమాలో కూడా ఆమె నటిస్తుందట.దీంతో పాటు మరిన్ని సినిమాల్లో కూడా జాన్వీ కనిపించనుందని సమాచారం.