Jayam Ravi: 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పిన జయం రవి గురించి ఎన్నో విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆయన ప్రేమ, పెళ్లి ఇలా ఎన్నో మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇండస్ట్రీలో స్టార్ అయిన జయం రవి ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆర్తి హీరోయిన్లకు మించిన అందంతో ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది.
Jayam Ravi cinematic love story
ఇక ఆర్తి ఎవరో కాదు టీవీ ప్రొడ్యూసర్ అయినటువంటి సుజాత విజయ్ కుమార్ డాటర్..ఇక జయం రవి ఆర్తిల లవ్ స్టోరీ మొదలైంది స్కాట్లాండ్ లో.. తొలి చూపులోనే జయం రవి ఆర్తితో ప్రేమలో పడ్డారట.అయితే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పడానికి భయపడి చాలా రోజులు సీక్రెట్ గా దాచి పెట్టారట.అంతేకాదు ఎక్కడా కూడా అనుమానం రాకుండా జయం రవి ఆర్తిలు జాగ్రత్త పడ్డారట. (Jayam Ravi)
Also Read: Trisha: విజయ్ పై ప్రేమతో కాదు.. కోటికి పైగానే కొట్టేసిన త్రిష..?
దాంతో వీరు డేటింగ్ చేసిన సమయంలో ఇంట్లో వాళ్లకు ఎక్కడ కనబడతామో అని కారులోనే అన్ని కానిచ్చేవారట.. అలా వీరి డేటింగ్ కాలం మొత్తం కారులోనే గడిచిపోయింది అంటూ ఓ ఇంటర్వ్యూలో రవి, ఆర్తిలు చెప్పారు. అంతేకాదు ఎక్కడికైనా స్పెషల్ ప్లేస్ కి వెళ్తే కనీసం ఫోటో తీసుకోవడానికి కూడా భయపడేవారట. అలా వీరు తమ బంధాన్ని బయట పెట్టడం కోసం భయపడి చాలా రోజులు దీన్ని సీక్రెట్ గా దాచారు.
కానీ ఇంట్లో వాళ్ళ అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని చాలా రోజులు వెయిట్ చేశారు. అలా 2009లో వీరి పెళ్లి జరిగింది. ఇక పెళ్లయ్యాక అందరూ ఆడ పిల్లలు కన్నవాళ్ళకి, పుట్టింటి నుండి వేరు పడుతున్నామని ఏడుస్తారు. కానీ ఆర్తి మాత్రం ఏడవలేదట.ఎందుకంటే తనకు ఎంతో ఇష్టమైన జయం రవితో సంతోషమైన భవిష్యత్తును ఊహించుకుందట.(Jayam Ravi)