Jayam Ravi: జయం రవి,ఆర్తి ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్టు జయం రవి చెప్పడంతో విడాకులపై ఇప్పటికే ఎన్నో పుకార్లు వస్తున్నాయి. వీరి విడాకులకు కారణం సింగర్ కెనీషా అని కొంతమంది అంటే రీసెంట్గా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఫోటోల ప్రకారం ప్రియాంక మోహన్ అంటున్నారు.అయితే ప్రియాంక మోహన్ అనేది తప్పు. ఎందుకంటే వీరిద్దరూ బ్రదర్ సినిమాలో నటించిన ఫోటోలు అవి. కానీ సింగర్ కెనీషా పేరు మాత్రం గట్టిగా వినిపిస్తోంది.అయితే జయం రవి 15 సంవత్సరాలుగా భార్యతో కాపురం చేసి సడన్గా భార్యకు విడాకులు ఇవ్వడానికి ఒక కారణం ఉందట.
Jayam Ravi exposed the things done by his wife
అదేంటంటే భార్య టార్చర్ భరించలేక ఇంట్లో నుండి బయటకు వచ్చేసాడని తెలుస్తోంది.ఇప్పటికే సింగర్ కూడా ఆర్తి చాలా టార్చర్ చేసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆర్తి చేసిన టార్చర్ కి జయం రవి డిప్రెషన్లోకి వెళ్లారని కూడా చెప్పింది.అయితే రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భార్య గురించి జయం రవి షాకింగ్ కామెంట్లు చేశారు.. నా భార్య నన్ను చాలా హీనంగా చూసింది. పూర్తిగా నా స్వేచ్ఛ మొత్తం లాగేసుకుంది. కాస్త కూడా స్వేచ్ఛను ఇవ్వలేదు.(Jayam Ravi)
Also Read: Mohan Raj: విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్స్ అయినా మోహన్ రాజ్ ఇకలేరు!!
ప్రతి విషయంలో నన్ను కంట్రోల్ చేయాలని నాకంటే హైలైట్ అవ్వాలని చూసేది.ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినివ్వకుండా ఆమె మాత్రం జల్సాలు షాపింగ్ లు చేసేది.డబ్బులన్నీ వాడుకునేది కానీ నేను అవసరాల కోసం ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేస్తే ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నావు అని నా మీద అరిచేది. అంతేకాదు నా అసిస్టెంట్ల ద్వారా నేను ఎక్కడ ఖర్చు పెడుతున్నానో ఏం చేస్తున్నానో అని ప్రతి ఒక్కటి తెలుసుకునేది.
ఇక డబ్బు ఖర్చు చేసిన ప్రతి సమయంలో నన్ను అనుమానించేది. ప్రతిక్షణం అనుమానాల మధ్య మా కాపురం ఇన్ని రోజులుగా నడిచింది.. ఇక ఈ టార్చర్ భరించలేను అనిపించింది. అందుకే స్వేచ్ఛ,గౌరవం లేని వ్యక్తితో జీవితం ఇంకా కొనసాగించడం వ్యర్థం అని భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అంటూ జయం రవి చెప్పుకోచ్చారు.ఇక ఈయన మాటలు విన్న నెటిజన్స్ జయం రవిని కుక్క కంటే హీనంగా చూసిందా అందుకే ఆయన విడాకులు తీసుకుంటున్నారా అని మాట్లాడుకుంటున్నారు.(Jayam Ravi)