Jayam Ravi: జయం రవి విడాకుల రచ్చ గత కొద్ది రోజులుగా మీడియాలో వైరల్ అవుతుంది. అయితే భార్యకి ఇష్టం లేకుండానే జయం రవి బలవంతంగా విడాకులు ఇచ్చినట్టు ఆర్తి మాటలు వింటే అర్థమవుతుంది. అయితే భార్యని వదిలించుకోవడానికి కారణం ఒకటి ఉందట.అదేంటంటే.. జయం రవి సింగర్ కేనీషాతో రిలేషన్ లో ఉండడం వల్లే భార్యని వదిలించుకున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే జయం రవి ప్రతి పెళ్లి రోజు నాడు తన ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్తారట.
Jayam Ravi Relation in Goa with that singer
కానీ ఈసారి పెళ్లి రోజుకి ఫ్యామిలీని పక్కన పెట్టి గోవా కి సింగర్ కెనీషాతో వెళ్లారట. అయితే షూటింగ్ అని చెప్పి గోవా కి వెళ్లారట.ఇక అక్కడ గోవాలో ఆర్తి పేరు మీద ఉన్న కారు మీద నిషేధించబడిన బ్లాక్ సన్ ఫిల్మ్ ఉండడంతో దానికి సంబంధించిన మెసేజ్ పోలీసులు ఆర్తి ఫోన్ కి పంపారు. దీంతో షూటింగ్ అని గోవాకి ఎందుకు వెళ్లారు అని ఆరా తీయగా కెనీషా పేరు బయటికి వచ్చింది. (Jayam Ravi)
Also Read: Mahesh Babu: మహేష్ బాబు రహస్య పెళ్లి.. ఇంటికి వచ్చి మరీ పెళ్లి ఆపిన మహిళ.. ఎవరంటే..?
ఆ తర్వాత ఇది కప్పిపుచ్చి ఎలాగలో సర్ది చెప్పారు. కానీ మళ్లీ ఆర్తి కారులో అధిక వేగంతో ప్రయాణించి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు ఆమెకు ఫైన్ పడిందట ఇక ఈ మెసేజ్ కూడా ఆర్తికి వెళ్లి ఆ కారు ఎవరు నడిపారని ఆరా తీయగా కెనీషా పేరు బయటికి రావడంతో వీరి వ్యవహారం బయటపడింది.అలాగే గోవాకి వెళ్లి పూర్తి వివరాలు ఆరా తీయగా కెనీషాతో గోవలో లగ్జరీ ఇల్లు కొనుక్కొని అక్కడే సహజీవనం చేస్తున్నాడని,
అందుకే అప్పుడప్పుడు గోవాకి జయం రవి వెళ్తున్నాడనే విషయం బయటపడడంతో ఆర్తి గొడవ చేసిందట. ఇక దీన్ని ఇంకా రహస్యంగా ఉంచలేని జయం రవి వెంటనే భార్యకు విడాకులు ఇచ్చారట. కానీ ఆర్తికి మాత్రం జయం రవికి విడాకులు ఇవ్వాలని లేదు. అయితే జయం రవి ఆ సింగర్ ని రెండో పెళ్లి చేసుకోవడం కోసమే భార్యకు బలవంతంగా విడాకులు ఇచ్చారని తెలుస్తోంది.(Jayam Ravi)