Jayam Ravi: జయం రవి విడాకులు తమిళ ఇండస్ట్రీలో దుమారం సృష్టించాయి. ఈయన విడాకుల విషయంలో భార్య కూడా అసంతృప్తిగా ఉంది.. కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయే దానికి ఇక్కడి దాకా వచ్చారు అని చాలామంది వీరిపై ఫైర్ అయ్యారు.అయితే ఇలాంటి వేళ తాజాగా బ్రదర్ సినిమా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జయం రవి మీడియా ముందుకు వచ్చారు. దీంతో ఈ మధ్యనే విడాకులు తీసుకున్న జయం రవి బయటకు వస్తే మీడియా వాళ్ళు ఆయనను ప్రశ్నలు వేయకుండా ఉంటారా..
Jayam Ravi started a new business with lover
ఆ విధంగానే ప్రశ్నలు సంధించారు. దాంతో జయం రవి ఎన్నో ఆసక్తికరమైన ఆన్సర్స్ ఇచ్చారు.. విడాకులు తెలియకుండా తీసుకున్నది ఏమీ కాదు.ఆర్తి తండ్రికి ఈ విషయం తెలుసు. ఆమెకి కూడా తెలుసు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అలాగే మేము విడాకులు తీసుకోబోతున్న విషయం నా పెద్ద కొడుకు కి కూడా చెప్పాను. చిన్న కొడుకుకి ఈ విషయం అర్థం కాదు. నేను నా భార్యతో విడాకులు తీసుకున్న విషయంలో సింగర్ కెనీషాని ఎందుకు లాగుతారు.(Jayam Ravi)
Also Read: Jani Master Case: కొత్త మలుపు తీసుకున్న జానీ మాస్టర్ కేసు.. అయన భార్య కూడా?
ఆమెకు దీనికి ఎలాంటి సంబంధం లేదు.నాకు ఆమెతో మంచి స్నేహం ఉంది. దాన్ని మీరు చెడగొట్టకండి.. ఆమె కేవలం సింగర్ మాత్రమే కాదు ఎంతోమంది డిప్రెషన్ తో బాధపడుతున్న వారిని ఆ డిప్రెషన్ నుండి బయటికి పడేసింది.ఆమె మంచి సైకాలజిస్ట్ ఇక త్వరలోనే సింగర్ కెనీషాతో నేను ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నాను. ఇప్పటికే ఆమె ఎంతోమంది మానసికంగా బాధపడుతున్న వారిని ఆ డిప్రెషన్ నుండి బయట పడేసింది.
ఆమెకి విడాకులకు ఎలాంటి సంబంధం లేదు అంటూ జయం రవి చెప్పారు.కానీ జయం రవి మాటలు విన్న అందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థం అయిపోయింది వీరి విడాకులకు కచ్చితంగా కెనిషానే కారణం అని..ఎందుకంటే విడాకుల వార్తలకు కారణమైన కెనీషా తోనే మళ్లీ ఆయన కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాననడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు వీరు పెళ్లి చేసుకుంటారా లేక సీక్రెట్ గా కొద్దిరోజులు డేటింగ్ చేసి విడాకుల వార్తల నుండి బయటపడ్డాక పెళ్లి చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.(Jayam Ravi)