JC Prabhakar Reddy: పార్టీలు మారే వారికి తగిన బుద్ధి చెప్పారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జెసి ప్రభాకర్ రెడ్డి. మొన్నటి వరకు వైసిపి పార్టీలో పని చేసిన… ఓ లాయర్ ను… తెలుగుదేశం పార్టీలో చేరుతానని వస్తే… చుక్కలు చూపించి ఇంటి బయట పడేశారు జేసి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుత రాజకీయాలలో… జంపింగ్ జపంగ్ కామన్ అయిపోయింది. JC Prabhakar Reddy
JC Prabhakar Reddy Intresting Incident In Tadipratri
ఒక పార్టీలో గెలిచిన నేతలు మరొక పార్టీ లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి… అన్నం పెట్టిన పార్టీకి ద్రోహం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో గులాబీ పార్టీ కూడా… ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. గులాబీ పార్టీ జెండాతో గెలిచిన దాదాపు పది మంది ఎమ్మెల్యేలు… కాంగ్రెస్ కండువా కప్పుకొని… కెసిఆర్ కు ద్రోహం చేశారు. JC Prabhakar Reddy
Also Read: Roja: ఛీ..ఛీ ఇదేం పాడుపని రోజా..రంగంలోకి జగన్ ?
అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన.. ఏపీలో కూడా చాలామంది నేతలు టిడిపిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అచ్చం అలాగే వైసిపి లాయర్ శ్రీనివాస్… మొన్నటి వరకు జగన్ పార్టీలో ఉన్నారు. జెసి బ్రదర్స్ ను దారుణంగా తిట్టారు. అంతకుముందు 2014 సంవత్సరంలో టిడిపిలోనే ఉండేవారు లాయర్ శ్రీనివాస్. కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో 2019లో ఆ పార్టీలోకి వెళ్లారు. ఆ సమయంలో జెసి ప్రభాకర్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ నేతలను దారుణంగా తిట్టారు. JC Prabhakar Reddy
ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి రావడంతో… ప్రభాకర్ రెడ్డిని కలిశారు. పార్టీలో చేరుతానని రిక్వెస్ట్ చేశారు. ఈ సమయంలో చిర్రెత్తిపోయిన జెసి… వెంటనే లాయర్ కాళ్లు కట్టేసి… గేట్ అవుతల… పడేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. టిడిపికి ద్రోహం చేసిన నేతలను ఎవరిని కూడా రానిచ్చేది లేదని హెచ్చరించారు. దీంతో చేసి చేసినట్లుగానే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వ్యవహరించాలని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. JC Prabhakar Reddy