NTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… వైసిపి పార్టీ దారుణంగా ఓడిన సంగతి మనందరికీ తెలిసిందే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది జగన్మోహన్ రెడ్డి పార్టీ. దీంతో వైసిపి పార్టీని తెలుగుదేశం ప్రభుత్వం ఒక ఆట ఆడుకుంటుంది. వైసిపి పాలనలో జరిగిన అవినీతిని.. బయటకు తీస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. గతంలో చంద్రబాబు పార్టీని ఆడుకున్న వైసీపీ ప్రభుత్వం… ఇప్పుడు వారి ఆక్రోసాన్ని అనుభవిస్తుంది. NTR
Jr. NTR Serious Warning to Kodali Nani and Vallabhaneni Vamsi
ముఖ్యంగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టార్గెట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ఇద్దరు లీడర్ల క్యాడర్ను… దాదాపు టిడిపి పార్టీలో చేర్పించుకుంది. అలాగే వీరు చేసిన అక్రమాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది టిడిపి పార్టీ. ఈ తరుణంలో… టాలీవుడ్ యంగ్ హీరో నందమూరి తారక రామారావు… అదే మన జూనియర్ ఎన్టీఆర్ టచ్ లోకి వెళ్లారట కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ. NTR
Also Read: Chandrababu: తెలుగు దేశం పార్టీకి లోక్ సభ స్పీకర్ పదవి..హిందీ రాదని ట్రోలింగ్..?
తెలుగుదేశం టార్చర్ నుంచి తమను తప్పించాలని… తమను రాజకీయంగా కాపాడాలని… జూనియర్ ఎన్టీఆర్ ను విన్నవించారట కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ. లేకపోతే తమ మనుగడ కష్టమవుతుందని తెలిపారట. అయితే దీనిపై వెంటనే స్పందించిన తారక్… తాను ఇప్పుడు ఏమీ చేయలేనని… రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే పెద్ద తప్పిదం జరుగుతుందని ఆయన వెల్లడించారట. NTR
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో… కొడాలి నాని, వల్లభనేని వంశీని కాపాడే ప్రయత్నం ఇప్పుడు చేయబోనని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారట. దీంతో కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ కంగు తిన్నారట. ఇక జూనియర్ ఎన్టీఆర్ చేతులు ఎత్తేస్తే… తమని కాపాడే నాథుడే లేడంటూ నేతలు చెబుతున్నారు. NTR