Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా ఉందని చెప్పవచ్చు. ఏపీలో మొన్న జరిగిన ఎన్నికల్లో వైసిపి పార్టీ 11 స్థానాలకు పరిమితం కావడం…. అలాగే… ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో… జగన్మోహన్ రెడ్డి ని పట్టించుకునే నాధుడే లేడు. అంతేకాదు… జగన్మోహన్ రెడ్డి పై వరుసగా కేసులు పెట్టుకుంటూ టిడిపి ప్రభుత్వం వెళ్తోంది. Jagan
Kadapa MP Avinash rebellion against Jagan
అలాగే వైసిపి లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న కొడాలి నాని లాంటి నేతలను కూడా టార్గెట్ చేస్తోంది. అయితే కూటమి సభ్యులు… అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డిని… మాటలతో దాడి చేసే ఛాన్స్ ఉంది. ఈ తరుణంలో ఈ ఐదు సంవత్సరాల పాటు అసెంబ్లీకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి స్కెచ్ వేశారట. Jagan
Also Read: Vijayashanthi: చంద్రబాబు,రేవంత్ లను తరిమి కొడతానని రాములమ్మ హెచ్చరిక..కేసీఆర్ గేమ్ షూరు అయ్యిందా ?
ఇందులో పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. పులివెందుల నియోజకవర్గం వర్గానికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేయాలని జగన్ ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. షర్మిలపై మొన్న అఖండ మెజారిటీతో విజయం సాధించారు అవినాష్ రెడ్డి. అయితే అవినాష్ రెడ్డి తో రాజీనామా పెట్టించి… జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నారట. Jagan
అలాగే పులివెందుల నుంచి విజయమ్మ లేదా వైయస్ భారతి ని రంగంలోకి దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. అయితే ఈ ప్రతిపాదనకు అవినాష్ రెడ్డి ఒప్పుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తాను రాజీనామా చేస్తే తన రాజకీయ భవిష్యత్తు బుగ్గిపాలు అవుతుందని ఆయన ఆలోచన చేస్తున్నారట. అందుకే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. అందుకే పులివెందుల ఎమ్మెల్యే పదవికి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయడం లేదని… వైయస్ సుబ్బారెడ్డి తాజాగా వెల్లడించారని తెలుస్తోంది. Jagan