Kalki 2898 AD: ఎంత పెద్ద సినిమా అయినా సరే ఎన్ని జాగ్రత్తలు వహించి తీసినా ఏదో ఒక విషయంలో చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటారు. అలా కల్కి సినిమా విషయంలో కూడా చిన్న చిన్న తప్పులు జరిగాయి. అయితే ఈ చిన్న చిన్న తప్పులు ప్రభాస్ వీరాభిమానులను తీవ్రంగా హర్ట్ చేస్తున్నాయట.మరీ ముఖ్యంగా వారి ఈగోని దెబ్బతీశాయని తెలుస్తోంది.మరి ఇంతకీ నాగ్ అశ్విన్ ప్రభాస్ అభిమానులు ఈగో దెబ్బ తినే అంత సన్నివేశాలు ఏం పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం..
Kalki 2898 AD: Prabhas fans ego hurt director .. what happened
నాగ్ అశ్విన్ కల్కి సినిమాతో ఒక విజువల్ వండర్ ను సృష్టించారు. ఈ సినిమాకి వాడిన గ్రాఫిక్స్ ఎఫెక్ట్లతో సినిమా చూసే వాళ్ళందరినీ ఓ అద్భుతమైన నగరానికి తీసుకువెళ్లారు. అయితే ఇంత పెద్ద హిట్టు టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో ఆ సన్నివేశాలు మాత్రం ప్రభాస్ అభిమానులను ఘోరంగా నిరాశపరిచాయట.(Kalki 2898 AD)
అవేంటంటే.. చిన్న చిన్న విషయాలకే అశ్వద్ధామ పాత్రలో నటించిన అమితాబ్ బచ్చన్ హీరో ప్రభాస్ ని కొట్టడం. అయితే ఇందులో మెయిన్ హీరో ప్రభాస్ కావడంతో వారి అభిమానులు అమితాబ్ బచ్చన్ చీటికీ మాటికి ప్రభాస్ ని అలా కొట్టడాన్ని సహించలేకపోతున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అభిమానులను క్షమాపణలు కోరిన సంగతి మనకు తెలిసిందే.
కానీ సినిమా షూటింగ్లో ఇది భాగం కాబట్టి దీన్ని అంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు అని కొంతమంది భావిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ ఇంట్రడక్షన్ తొందరగా ఉండకపోవడం కూడా ప్రభాస్ అభిమానులను కాస్త నిరాశపరిచింది.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కంటే ఎక్కువగా శంబలా నగరంలోని కాంప్లెక్స్ నే ఎక్కువగా హైలెట్ చేయడంతో కొంతమంది ప్రభాస్ అభిమానులు ఈ విషయంలో నిరాశపడుతున్నారట.(Kalki 2898 AD)