Kareena Kapoor: సినిమా ఇండస్ట్రీలో విడాకులు ఇప్పుడు చాలా సాధారణమైన విషయంగా మారిపోయాయి. ఎన్నో సంవత్సరాలు కలిసి జీవించిన జంటలు, పిల్లలు ఉన్నప్పటికీ విడిపోతున్న సంఘటనలు ప్రతి రోజూ మనమూ చూస్తున్నాం. టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ ఇవి జరుగుతున్నాయి. తాజాగా సమంత- నాగచైతన్య, ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ వంటి జంటలు విడిపోయిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ లో ఒక పెద్ద సంచలనం సృష్టిస్తున్న వార్త ఏమిటంటే, సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్ విడాకులు తీసుకోబోతున్నారని వస్తున్న వార్తలు.
Kareena Kapoor Tattoo Removal Sparks Divorce Speculations with Saif Ali Khan
2012లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్నారు అనిపించిన ఈ జంట విడిపోతున్నారనే వార్త రావడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. సైఫ్ తన చేతిపై వేసుకున్న కరీనా కపూర్ టాటూను తొలగించడం, ఈ విడాకుల వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. కరీనా కూడా ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉండడం, సైఫ్ మూడో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : Kavya Thapar: కావ్య థాపర్ ని నిండా ముంచిన ముగ్గురు హీరోలు..అలా చేశారేంటి?
సైఫ్ అలీ ఖాన్‌కు ఇది మూడో వివాహం అవుతుంది. 1991లో నటి అమృత సింగ్‌ను వివాహం చేసుకుని, 2004లో విడిపోయారు. ఆ తర్వాత కరీనా కపూర్‌ను ప్రేమించి 2012లో రెండవ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు కరీనా తో విడిపోవడానికి సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సోషల్ మీడియా లో పెద్ద చర్చ మొదలైంది.
కొంతమంది నెటిజన్లు ఈ వార్తలను నమ్మడం లేదు, సైఫ్- కరీనా అనేక మందికి ఆదర్శ దంపతులు అని, వారు విడిపోరనే అంటున్నారు. మరికొందరు మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఏది శాశ్వతం కాదని, విడాకులు తీసుకోవడంలో తప్పు లేదని అభిప్రాయిస్తున్నారు. ఏదైనా, సైఫ్- కరీనా విడాకుల వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది.