Karthikeya 2: తాజాగా కేంద్ర ప్రభుత్వం 70 వ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది.ఇక ఈ అవార్డుల్లో సౌత్ ఇండస్ట్రీ కూడా సత్తా చాటింది. అయితే ఉత్తమ ప్రాంతీయ సినిమాలలో బలగం,సీతారామం, కార్తికేయ -2, మేజర్ వంటి నాలుగు సినిమాలు పోటీ పడగా ఈ నాలుగు సినిమాల్లో కార్తికేయ -2 కి ఉత్తమ జాతీయ చలనచిత్ర అవార్డు వరించింది. ఇక ఈ అవార్డు రావడంతో నిఖిల్ కి కార్తికేయ -2 చిత్ర యూనిట్ కి సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన ఎంతో మంది పెద్దలు అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది.
Karthikeya 2: Netizens are wishing Nitin if Nikhil gets an award.. because
అదేంటంటే నిఖిల్ హీరోగా చేసిన కార్తికేయ 2 మూవీకి అవార్డు వస్తే నితిన్ కి కొంతమంది నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి నిఖిల్ కి వస్తే నితిన్ కి ఎందుకు శుభాకాంక్షలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. గతంలో కార్తికేయ 2 మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాక నిఖిల్ ని కేంద్రమంత్రి జేపీ నడ్డా కలవాలని ఆహ్వానం పంపించారు.అయితే ఈ ఆహ్వానం పొరపాటున నిఖిల్ కి అందకుండా నితిన్ కి అందింది. దాంతో నిఖిల్ కూడా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నన్నెందుకు కలవడానికి ఆహ్వానం పంపించాడో తెలుసుకుందాం అని ఆయన వెళ్లారు. (Karthikeya 2)
Also Read: Sridevi: బాహుబలి వెనుక షాకింగ్ నిజం.. శ్రీదేవిపై కుట్ర చేసింది వాళ్లేనా..?
ఇక ఆ సమయంలో నితిన్ కి పూల బొకే ఇచ్చి కార్తికేయ 2 సినిమా చాలా బాగుంది. అందులో మీ నటన అద్భుతంగా ఉంది అంటూ కొనియాడారట.అయితే ఈ విషయం తెలిసిన నితిన్ సారీ సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ సినిమాలో నటించింది నేను కాదు నిఖిల్ సిద్ధార్థ అంటూ చెప్పడంతో పొరపాటు అయిపోయిందని చెప్పారట. అయితే ఆహ్వానం తప్పుగా అందడంతో నిఖిల్ కి బదులు నితిన్ వచ్చారు. అయితే ఈ విషయం అప్పట్లో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది.
అయితే తాజాగా కార్తికేయ -2 కి అవార్డు రావడంతో చాలామంది అప్పటి సందర్భాన్ని గుర్తుచేసుకొని నితిన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే కార్తికేయ 2 కి అవార్డు రావడం వెనుక రాజకీయ కోణం ఉందని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఎందుకంటే సీతారామం,బలగం,మేజర్ వంటి సినిమాలను వదిలేసి కార్తికేయ 2 కి అవార్డు రావడం ఏంటి అని మాట్లాడుకుంటున్నారు.అంతేకాదు కేంద్రంలో ఉన్న పార్టీతో కార్తికేయ -2 నిర్మాతకి మంచి అనుబంధం ఉందని ఈ కారణంతోనే కార్తికేయ 2 కి అవార్డు వచ్చిందని కొంతమంది భావిస్తున్నారు.(Karthikeya 2)