Katrina Kaif: బాలీవుడ్ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. నమస్తే లండన్, వెల్కమ్, పార్టనర్, రేస్, సింగ్ ఈజ్ కింగ్, ఏక్ థా టైగర్ వంటి హిందీ చిత్రాలలో నటించింది. ఆ సినిమా లు ఆమెకు భారీ క్రేజ్ ను తీసుకుని వచ్చాయని చెప్పాలి. కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన ఈ ముద్దుగుమ్మ మల్లీశ్వరి సినిమాతో తెలుగు తెరపైకి కూడా అడుగుపెట్టింది. అయితే ఆ తర్వాత హిందీ లో ఎక్కువ అవకాశాలు రావడం తో తెలుగు వైపు మళ్ళీ కన్నెత్తి కూడా చూడలేదు.
Katrina Kaif net income value in crores
హిందీ లో మాత్రం కత్రినా బ్యాక్ టు బ్యాక్ హిందీ చిత్రాలలో నటించింది. ఆల్మోస్ట్ నెంబర్ వన్ స్థానం లో ఉన్నప్పుడే ఈ ముద్దుగుమ్మ బిటౌన్ హీరో విక్కీ కౌశల్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న కత్రినా తాజాగా ‘మెర్రీ క్రిస్మస్’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం కత్రినా కైఫ్ ఒక్కో సినిమాకు రూ.15-20 కోట్లు తీసుకుంటోందట.
Also Read: RC16: శంకర్ సినిమా మర్చిపోవాల్సిందేనా.. బుచ్చిబాబు పై రామ్ చరణ్ ఫోకస్!!
అలాగే, కత్రినా కైఫ్‌కు ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 78.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో తన సోషల్ మీడియాలో బ్రాండ్లు మరియు కంపెనీల గురించి యాడ్స్ పోస్ట్ చేస్తుంది. తన సోషల్ మీడియా లో వేసే ఒక్క ప్రకటన ద్వారా వచ్చే ఆదాయం రూ. 6 కోట్లకు పై మాటే. ఆ విధంగా ఇటు సినిమా లలో అటు యాడ్స్ తో కలిపి కోట్ల లలో సంపాదిస్తుంది కత్రిన.. ఏదేమైనా సినిమా లు లేకపోయినా, పెళ్లి అయ్యిన తర్వాత కూడా కత్రినా కైఫ్ ఈ రేంజ్ లో సంపాదించడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక పోతే ఆమె ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 224 కోట్లు అని తెలుస్తుంది. హీరోయిన్ గా వచ్చి అన్ని కోట్ల రూపాయలు సంపాదించడం గ్రేట్. ఇక కొన్నాళ్లుగా మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన కత్రినా.. ఇటీవల అంబానీ పెళ్లి వేడుకలో భర్త విక్కీ కౌశల్‌తో కలిసి సందడి చేసింది.