KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డేంజర్ బెల్స్ పంపారు గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు. చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న… తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒక్కసారిగా పెను బాంబు లాంటి… వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం పోయిందని.. కేవలం 11 రోజుల్లోనే ఈ పరిస్థితి నెలకొందని కేసీఆర్ పేర్కొనడం జరిగింది. KCR

KCR Comments On Revanth Reddy

ఇప్పుడు ఎన్నికలు వచ్చిన 100కు 100% గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. కేసులు పెడుతున్నారని అలాగే జైల్లో వేస్తున్నారని గులాబీ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా బాధపడకూడదు అని… ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విజయం మనదేనని భరోసా కల్పించారు కేసీఆర్. 11 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ఇంతలా వ్యతిరేకత వస్తుందని ఎవరు ఊహించలేదన్నారు. KCR

Also Read: Rahul Gandhi: కాంగ్రెస్ లో ముసలం..రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పని రాహుల్ గాంధీ ?

తెలంగాణ ప్రజలకు గులాబీ పార్టీ పైన మంచి విశ్వాసం ఉందని.. కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత… ప్రజలు మన వైపు మళ్లీ వస్తున్నారని వెల్లడించారు. పాలకుర్తి నియోజకవర్గం లో ఇటీవల ఆత్మ***త్య చేసుకున్న.. గిరిజన బిడ్డ శ్రీనివాసుని కలుస్తానని… త్వరలోనే బయటికి రాబోతున్నట్లు సంకేతాలు పంపారు కేసీఆర్. ప్రభుత్వం కట్టాలి కానీ కూల్చకూడదన్నారు. KCR