KCR: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో… ఇప్పుడు అంతా కొడంగల్ గురించే మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ కావడంతో… అందరూ ఆ నియోజకవర్గంలో రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు.. రెండు రోజుల కిందట… వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ పైన కొడంగల్ నియోజకవర్గ రైతులు దాడి చేసిన సంగతి తెలిసిందే. KCR
KCR Off To Kodangal
కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా…. రైతులందరూ గత 9 నెలలుగా ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఎవరు కూడా వాళ్ళ ఆందోళనలను పట్టించుకోవడం లేదు. ఈ తరుణంలోనే కొడంగల్ నియోజకవర్గానికి వచ్చిన కలెక్టర్ పైన దాడి చేశారు రైతులు. అయితే ఈ సంఘటన వెనుక పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడని ఆయనను అరెస్టు చేశారు. KCR
Also Read: YCP: ఏపీ పోలీసులకు ఉరి వేయడం గ్యారంటీ.. వైసిపి స్ట్రాంగ్ వార్నింగ్?
పట్నం నరేందర్ రెడ్డి కి 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. ఆయనతో పాటు కేటీఆర్ పైన కూడా కేసులు పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో… కొడంగల్ నియోజకవర్గానికి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే జనాల్లోకి రాబోతున్నారు కేసీఆర్. అయితే కొడంగల్ రైతుల కోసం… అక్కడికి వెళ్లి.. రేవంత్ రెడ్డి పై యుద్ధం ప్రకటించే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. KCR