Keerthy Suresh: కీర్తి సురేష్ కీలకపాత్రలో నటించిన రఘు తాత సినిమా ఆగస్టు 15న తమిళంలో విడుదలయ్యింది. అయితే ఈ సినిమా లో హిందీ భాష నేర్చుకోవడం గురించి అప్పట్లో హిందీ భాషకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం గురించి ఉంటుంది. అయితే ఈసినిమాలో హిందీ వ్యతిరేక ఉద్యమం గురించి సీరియస్ గా కాకుండా కామెడి టచ్ ఇచ్చి తెరకెక్కించారు డైరెక్టర్ సుమన్ కుమార్..
Keerthy Suresh is entering politics to support that hero
హోంబాలే ఫిలిమ్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన రఘుతాత సినిమా ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కీర్తి సురేష్ మాట్లాడుతూ.. హిందీ నేర్చుకోకూడదు అని చెప్పడం లేదు.కానీ హిందీని బలవంతంగా రుద్దకూడదు అనే విషయాన్ని ఈ సినిమాలో చెప్పాము.(Keerthy Suresh)
Also Read: Nithiin: నోరు మూసుకో లేదంటే నీ అంతు చూస్తా.. నితిన్ కి వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్.?
అలాగే సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో విషయాలను కూడా ఇందులో చూపించాం.. అలాగే ఈసినిమాని కుటుంబం అందరూ కలిసి చూడచ్చు.ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాల పైనే ఉంది.అలాగే రాజకీయాల్లోకి రావాలి అనే కోరిక నాకు ఏమాత్రం లేదు అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. అయితే గత కొద్ది రోజు నుండి కీర్తి సురేష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.
దానికి ప్రధాన కారణం హీరో విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే విజయ్ పార్టీలోకి కీర్తి సురేష్ చేరి సినిమాలు మానేసి రాజకీయాల్లోకి రాబోతుందనే ఓ రూమర్ వినిపిస్తోంది.కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని కొట్టి పారేసింది కీర్తి సురేష్.(Keerthy Suresh)