Keerthy Suresh: మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ నిజంగానే పెళ్ళి కొడుకుని సెట్ చేసుకుందా.. ఆ వ్యక్తితో ఏడడుగులు వేయబోతుందా.. వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉంది.. వరుస సినిమాలతో జోరు మీదున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్లు షాక్ అవుతున్నారు.అయితే గత కొద్ది రోజులుగా కీర్తి సురేష్ తన చిన్ననాటి ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.చాలా రోజుల నుండి వీరిద్దరి మధ్య పరిచయం ఉందని, అది కాస్త ప్రేమగా మారి త్వరలోనే ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారంటూ ఓ రూమర్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Keerthy Suresh marraige
అయితే తాజాగా ఈ రూమర్ గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది కీర్తి సురేష్.. కీర్తి సురేష్ ప్రస్తుతం రఘుతాత అనే మూవీలో చేసింది.ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవ్వబోతుండడంతో సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ని నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో అభిమానుల నుండి కీర్తి సురేష్ కి పెళ్లి ప్రశ్న ఎదురయ్యింది.(Keerthy Suresh)
Also Read: Raj Tarun: పురుషోత్తముడు మూవీ రివ్యూ!!
మీ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్ వినిపిస్తుంది. అది నిజమేనా.. దీనిపై ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు అని కొంతమంది అభిమానులు అడగగా.. ఇలాంటి రూమర్స్ పై స్పందిస్తే నిజమే అనుకుంటారు.అలాగే ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటున్నాను అంటూ వస్తున్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదు. అందుకే వీటిపై నేను అంతగా స్పందించను. ఒకవేళ స్పందిస్తే నిజంగానే అవునని అనుకుంటారు.
అయితే నా వ్యక్తిగత విషయాల గురించి పెళ్లి,ప్రేమ వంటి వాటి పై రూమర్స్ వినిపిస్తే వాటి గురించి అస్సలు స్పందించను.కానీ నా నటనపై ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం ఎలాంటి అభ్యంతరం లేకుండా స్వీకరించి తర్వాత సినిమాల్లో ఎలా చేయాలి అనేది ఆలోచిస్తాను అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.ఇక కీర్తి సురేష్ క్లారిటీతో ఆమె పెళ్లి వార్తలు రూమర్సే అని అందరికీ అర్థమయ్యాయి.(Keerthy Suresh)