Rinku Singh as Captain: ఐపీఎల్ 2025 మెగా వేలం జరిగే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్‌ను ఏకంగా 13 కోట్ల రూపాయల రికార్డ్ ధరకు రిటైన్ చేయడం అందరికి షాక్ ఇచ్చిన కేకేఆర్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గత సీజన్‌లో రింకూ తన అద్భుతమైన ఆటతీరుతో అందరి ప్రశంసలు పొందాడు. అతనిని రిటైన్ చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కానీ అతడే కేకేఆర్ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది.అవును అతనిని కెప్టెన్ గా నియమించడమే అందరిని ఆశ్చర్యపరిచింది.
KKR Surprise Move Rinku Singh as Captain
గతేడాది ఐపీఎల్ టైటిల్ గెలిపించిన శ్రేయస్ అయ్యర్‌ను వేలంలో వదిలేయడం. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తిరిగి వెళ్లే అవకాశాలు ఉన్న శ్రేయస్ కేకేఆర్లో లేకపోవడం కేకేఆర్ జట్టుకు ఒక పెద్ద లోటనే చెప్పాలి. ఈ కారణంగా కేకేఆర్‌కి కొత్త కెప్టెన్ అవసరం ఏర్పడింది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వంటి ప్రముఖ ఆటగాళ్లు వేలంలో ఉన్నప్పటికీ, వీరిద్దరూ కోల్‌కతా జట్టులోకి వచ్చే అవకాశం అంత సులభంగా కనిపించడం లేదు.
Also Read: Rajamouli: రాజమౌళి అవమానించడంతో సర్జరీ చేయించుకున్న స్టార్ హీరో.?
ఈ నేపథ్యంలో, కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్ జట్టులో ఉన్న రింకూ సింగ్‌ను కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దేశవాళీ క్రికెట్‌లో కూడా కెప్టెన్‌గా వ్యవహరించని రింకూ, ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ జట్టుకు నాయకత్వం వహించడం కొంత ఆశ్చర్యకరంగానే ఉన్నా, కేకేఆర్ మేనేజ్‌మెంట్ అతనిలోని సహజమైన నాయకత్వ లక్షణాలను నమ్మి ఈ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. రింకూ సింగ్ తన ఆటతీరుతో ఇప్పటికే జట్టులో విశ్వాసం నింపాడు కాబట్టి అతనిపై ఈ నమ్మకాన్ని కేకేఆర్ పెట్టిందని భావించవచ్చు.
రింకూ సింగ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తే, అతని పైన భారీ అంచనాలు ఉంటాయి. కెప్టెన్సీతో పాటు అతను తన ఆటను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, మరియు జట్టును విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం అతనికి ఒక కీలక సవాలుగా మారుతుంది. అయితే, రింకూ సింగ్‌లోని ఆత్మవిశ్వాసం, నిరంతరం మెరుగుపరచుకుంటూ వెళ్లే విధానం చూస్తే, అతను ఈ సవాలను అధిగమించి జట్టును విజయవంతంగా నడిపించగలడని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తంగా, ఐపీఎల్ 2025కు ముందు కేకేఆర్ తమ జట్టులో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. రింకూ సింగ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తే, అతని నాయకత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త అధ్యాయం మొదలవుతుంది.