Kollywood: టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పండగలను టార్గెట్ చేస్తూ సినిమాలను చేయడం వాటిని ఆ పండగలకి విడుదల చేయడం వంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి దసరా పండుగకు ఏ ఒక్క టాలీవుడ్ సినిమా కూడా రాకపోవడం నిజంగా తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచే విషయమే. దసరా పండుగ అంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ. అలాంటి పండుగ సమయంలో ఒక మంచి సినిమా చూడాలని ప్రతి ఒక్క తెలుగు వాడు కూడా కోరుకుంటారు.
Kollywood Movies for Dasara Season
ఆ విధంగా ఈ దసరా పండుగకు కొన్ని సినిమాలు రావాలని ప్రేక్షకులు కోరుకోగా పలు కారణాలవల్ల ఆయా సినిమాలు దసరా పండుగకు సిద్ధం కాలేకపోయాయి. దాంతో తెలుగులో పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు తమిళ హీరోలు. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న ఓ ఇద్దరూ తమిళ హీరోలు తమ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చి హిట్లు అందుకోవాలని భావిస్తున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.
Also Read: Mamitha Baiju: ప్రేమలు బ్యూటీ కి తెలుగు ఆఫర్స్!!
జైలర్ సినిమాతో తన ప్రభంజనాన్ని మళ్లీ చాటుకున్న హీరో రజనీకాంత్ తాజాగా వెట్టియన్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా వఋస సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ఈ దర్శకుడు ఈ చిత్రాన్ని తన పాత సినిమాల మాదిరిగానే చేస్తూన్నారు. ఈ నేపథ్యంలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాను తెలుగు తమిళ తో పాటు హిందీలో కూడా విడుదల చేయనున్న నేపథ్యంలో దీనికి దసరా పండుగ సమయంలో విడుదల చేస్తే బాగుంటుంది అనేది దర్శకుడు చేస్తున్న ఆలోచన.
ఇక కోలీవుడ్ చిత్ర పరిశ్రమ లో ఆగ్ర హీరోగా ఉన్న విజయ్ దళపతి నటిస్తున్న తాజా సినిమా ‘గోట్’ కూడా దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. వెరైటీ చిత్రాల దర్శకుడైన వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తూ ఉండగా విజయ దళపతి నటిస్తున్న ఆఖరి చిత్రం అని అందరూ అంటున్నారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో చేస్తున్న చివరి సినిమా కావడంతో ఈ సినిమా పట్ల అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆ విధంగా ఈ చిత్రం కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ సృష్టించబోతున్నాడని అంటున్నారు. మరి ఈ రెండు సినిమాలకు ఈ దసరా పండుగ ఏవిధంగా కలిసి వస్తుందో చూడాలి.