Koratala Siva: తెలుగు ప్రేక్షకులను మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో అలరించిన దర్శకుడు కొరటాల శివ, తన తాజా చిత్రం ‘దేవర’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఎన్టీఆర్‌తో కలిసి చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, సినిమా విడుదల తర్వాత వస్తున్న స్పందన మాత్రం మిశ్రమంగా ఉంది.

Koratala Siva Storytelling Fails to Impress in Devara

దేవరలో కూడా కొరటాల శివ తన వరల్డ్ బిల్డింగ్, స్టార్ హీరోలకు కొత్త ఇమేజ్ ఇవ్వడం వంటి మూలాలు చూపించారు. కానీ ఈ సినిమాలో ఎమోషన్ల లోపం, లాజిక్ లోపం కొంతవరకు కనిపిస్తుండటం గమనార్హం. ముఖ్యంగా ఆయన మునుపటి చిత్రాల్లో ఉన్న కథన శైలి ఈ సినిమాలో తక్కువగా ఉండటం అభిమానులను నిరాశపరిచింది.

Also Read: Devara Review: ఎన్టీఆర్ ‘దేవర’మూవీ రివ్యూ!!

కొరటాల శివ తన మొదటి చిత్రం మిర్చి తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి క్లాసిక్ సినిమాలతో కమర్షియల్, క్లాస్ ప్రేక్షకులను కట్టిపడేశారు. కానీ ‘దేవర’లో ఆయన అవి చుపించాలేకపోయాడు. కొత్తదనం లేని కథ, రొటీన్ నరేషన్ వల్ల సినిమా బోరింగ్‌గా మారిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తంగా, ‘దేవర’ సినిమా కొరటాల శివ కెరీర్‌లో ఒక మలుపు. ఆయనలోని కొత్తదనం ఈ సినిమాలో తగ్గిపోవడం వల్ల, ప్రేక్షకులు మరింత నూతన కథనాన్ని ఆశిస్తున్నారు. ఆయన తదుపరి చిత్రంలో ఈ విమర్శలను పరిగణనలోకి తీసుకుని మరింత మెరుగైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని ఆశిద్దాం.

https://twitter.com/YashTweetz___/status/1839633653393158653