Koushik Reddy: రేవంత్ రెడ్డి దుబాయ్, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నైలో.. ఏమేం చేసిండో చెప్తే.. భార్య, బిడ్డ కూడా ఇంటికి రానివ్వదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నేను 2021 వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా నని అని చెప్పారు కౌశిక్.. ఎవరెవరు ఏం చేస్తారో నాకు తెల్వదా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి… ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. తాజాగా కాంగ్రెస్ నేతలు… డ్రగ్స్ అంశంపై విసిరిన సవాల్ కు స్పందించారు కౌశిక్ రెడ్డి. Koushik Reddy
Koushik Reddy Slams Cm revanth reddy
గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు డ్రగ్స్ టెస్టుకు రెడీగా ఉన్నామని… కాంగ్రెస్ నేతలు కూడా ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలని.. కౌంటర్ ఇస్తూ సంచలన ప్రకటన చేశారు కౌశిక్ రెడ్డి. అనిల్ కుమార్ గతంలో డ్రగ్స్ తీసుకున్నాడని కూడా ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో డ్రస్సు ఎవరెవరు తీసుకున్నారా వాళ్లందరి పేర్లు తన దగ్గర ఉన్నాయని కూడా.. బాంబు పేల్చారు కౌశిక్ రెడ్డి. Koushik Reddy
Also Read: Constables: బెటాలియన్ కానిస్టేబుల్స్ కు నిరసనల పోస్టులకు లైక్ కొడితే చర్యలు ?
కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఇంట్లో దీపావళి అలాగే నూతన గృహప్రవేశం పార్టీ జరిగితే.. తప్పుడు వార్తలు రాశారని ఆగ్రహించారు. గతంలో తనపై కూడా ఇలాంటి… ఆరోపణలు చేయించింది రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ఇకనుంచి గులాబీ పార్టీ నేతలు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని… అందరికన్ను మన నేతల పైన ఉందని సూచించారు. రెచ్చిపోతున్న పోలీసులకు వార్నింగ్ కూడా ఇచ్చారు కౌశిక్ రెడ్డి. అందరి పేర్లు బ్లాక్ బుక్ లో రాసుకున్నామని… అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయిన అధికారిని కూడా వదలబోమని హెచ్చరించారు. Koushik Reddy