Krishna is shocked at what Nagma did wearing a bikini

Nagma: సీనియర్ నటి నగ్మా కి చాలా అహంకారం ఉండేది అని ఎంతోమంది ఆమెతో పని చేసిన వాళ్ళు చెప్పిన మాటలు. స్టార్ హీరోలుగా చలామణి అయిన కృష్ణ,శోభన్ బాబు, చిరంజీవిల దగ్గర సైతం ఈమె తన పొగరుని చూపించింది. ఒకసారి చిరంజీవి సినిమా చేసే సమయంలో ఆయనతో నేను రొమాన్స్ చేయడం ఏంటి అని అవమానించిందట.అలాగే శోభన్ బాబుని కూడా అవమానిస్తే ఆయన నీ ఆస్తి మొత్తం నా బాత్రూమ్ విలువ కాదు అంటూ తిప్పి కొట్టారట.

Krishna is shocked at what Nagma did wearing a bikini

ఇక కృష్ణ దగ్గర కూడా ఇలాంటి వేషాలే వేసిందట. కృష్ణ తో సినిమాలో చేసే సమయంలో నిర్మాతలకు షాక్ ఇచ్చి సినిమా షూటింగ్ సమయంలో గోలగోల చేసిందట. కానీ చివరికి ఈ హీరోయిన్ కి సంబంధించిన సీన్స్ మొత్తాన్ని సినిమాలో మార్చేశారు. ఇక ఆ సినిమా ఏంటంటే.. భరత సింహం.. కృష్ణ,నగ్మా కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీకి డైరెక్టర్ సాగర్ దర్శకత్వం వహించారు.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నగ్మా రెండు బికినీలు వేసుకొని సీన్ చేయాల్సి ఉంటుందట. (Nagma)

Also Read: Manchu Vishnu: పెళ్లికి ముందే ఆ అమ్మాయితో మంచు విష్ణు ఎఫై**.. ఇంట్లో నుండి వెళ్లగొట్టిన మోహన్ బాబు.?

అయితే ఈ సీన్ తీసే సమయంలో రెండు బికినీలను డైరెక్టర్ నగ్మానే కొనుక్కొచుకోమన్నారట.నిర్మాత డబ్బులు ఇస్తానన్నారట.అయితే షూటింగ్ అయిపోయాక నగ్మా ఆ రెండు బికినీల ధర 60 వేలు చెప్పిందట.దాంతో షాక్ అయిపోయిన నిర్మాత రెండు చిన్న బికినీలకు 60 వేలు అవుతుందా అని గొడవ పడ్డారట. దానికి నగ్మా ఫైర్ అయ్యి గొడవ మరింత పెద్దది చేసిందట. అయితే 60 వేలు తాను ఇస్తానని డైరెక్టర్ సాగర్ చెప్పినా కూడా మీ డబ్బులు నాకు వద్దు నాకు నిర్మాత ఇస్తేనే తీసుకుంటాను అని గోల చేసి అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోయిందట నగ్మా.

 Krishna is shocked at what Nagma did wearing a bikini

ఆ తర్వాత ఎంతమంది బ్రతిమిలాడిన వినలేదట. ఇక చివరికి కృష్ణనే స్వయంగా వెళ్లి చెప్పినా కూడా వినకపోవడంతో డైరెక్టర్ సాగర్ నగ్మా కి సంబంధించిన పాత్ర మొత్తం మార్చేసి ఆమె క్యారెక్టర్ ని వేరే విధంగా చూపించారట. అలా ఈ సినిమా షూటింగ్ సమయంలో పెద్ద రచ్చ చేసింది అంటూ సాగర్ ఓ ఇంటర్వ్యూలో నగ్మా కి సంబంధించిన నిజ స్వరూపం బయట పెట్టారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నగ్మాని తీసుకోమని వేరే వాళ్ళు చెప్పినా కూడా డైరెక్టర్ సాగర్ ఆమెని తీసుకోలేదట.(Nagma)