Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కమ్యూనిస్ట్ నేత సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాల్లో తీరని లోటు అని పేర్కొన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో పాల్గొన్న రేవంత్, ఏచూరి ప్రజాస్వామిక స్పూర్తికి నిలువుటద్దం అని ప్రశంసించారు. ఆయనతో మాట్లాడిన ప్రతిసారీ జైపాల్ రెడ్డి గుర్తుకు వచ్చేవారని, దేశ రాజకీయాల్లో ఏచూరి స్థానం కీలకమని చెప్పారు.
KTR and Revanth Reddy Share Stage at Sitaram Event
సీతారాం ఏచూరి, జైపాల్ రెడ్డి సమకాలికుడిగా ఉండి, చివరి వరకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, పేదల కోసం పోరాడిన వ్యక్తి అని రేవంత్ కొనియాడారు. యూపీఏ హయాంలో పేదలకు మేలు చేసే కీలక బిల్లులకు ఏచూరి మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ కూడా ఆయనను మార్గదర్శకుడిగా భావించారని అన్నారు.
Also Read: Rohit Sharma: విరాట్ కోహ్లి మీద చిరకుపడ్డ రోహిత్.. బంగ్లా మ్యాచ్ లో విడ్డూరం!!
జమిలి ఎన్నికల అంశంపై మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల పేరుతో కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి లాంటి నేతలు లేకపోవడం దేశ రాజకీయాలకు పెద్ద నష్టం అని చెప్పారు. సీతారాం ఏచూరి స్పూర్తితో జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ సభలో పాల్గొన్నారు. ఈ రోజుల్లో చాలా మంది నాయకులు తరచూ పార్టీలు మారుతున్న ఈ ఫిరాయింపు రాజకీయాల్లో, సీతారాం ఏచూరి చివరి వరకు కమ్యూనిస్టుగా నిలిచిన ఆదర్శ నేత అని కేటీఆర్ కొనియాడారు.