KTR: తెలంగాణ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై… తాజాగా కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వి పొలిటికల్ బాంబులు కాదని… అవి కేవలం తుస్సు బాంబులని… సెటైర్లు పేల్చారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. తాజాగా… తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో… గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పర్యటించడం జరిగింది. KTR
KTR Counter To Ponguleti Srinivas Reddy
ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీల పెంపులు, సిరిసిల్ల నియోజకవర్గంలో కార్మికులకు కరెంటు చార్జీల పెంపు విషయంపై మాట్లాడారు కేటీఆర్. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. రెండు రోజుల కిందట… పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలోనే పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొనడం జరిగింది. దీంతో గులాబీ నేతలను అరెస్టు చేస్తానని అందరు అనుకున్నారు. KTR
Also Read: Janasena: జనసేనలోకి మేకతోటి సుచరిత ?
అయితే దీనిపై తాజాగా కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. మూసి నది ప్రాజెక్టు బాధితుల సమస్యలను డైవర్ట్ చేసేందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని చురకలాంటించారు. ఎలాంటి విచారణకైనా మేము సిద్ధమేనని వెల్లడించారు. కేసులకు మేము భయపడబోమని తెలిపారు. దమ్ముంటే అరెస్టు చేయాలని కూడా స్పష్టం చేశారు కేటీఆర్. 6 గ్యారంటీలు అడగకూడదని.. ఇలా పొలిటికల్ బాంబులు అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. KTR