KTR: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జైలుకు వెళ్తారని హెచ్చరించారు కేటీఆర్. తాజాగా తెలంగాణ భవన్ లో కల్వకుంట్ల తారక రామారావు మీడియాను అడ్రస్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన పెను సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. KTR
ktr counter to ponguleti srinivas reddy
రేవంత్ రెడ్డి చెప్పినట్లు చేస్తే అధికారుల ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ఉద్యోగం పోయినట్లు పోతుందన్నారు కేటీఆర్. కేబినెట్లో కూర్చున్న మంత్రి పొంగులేటికి సంబంధించిన కంపెనీకి ఈ పనులు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన ఉందన్న విషయమన్న అసలు తెలుసా? అని అగ్రహించారు. KTR
Also Read: Teenmar Mallanna: మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కూలనున్న రేవంత్ ప్రభుత్వం?
రేవంత్ రెడ్డి సహాయ మంత్రి అయిన బండి సంజయ్ ఎందుకు దీని మీద మాట్లాడటం లేదన్నారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు. మోడీ ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ గురించి మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఎలాంటి చర్యలు ఉండవు అన్నారు. బావమరదికి అమృత్ టెండర్లు, మేఘా, రాఘవ సంస్థలకు ప్రాజెక్ట్‌లను రేవంత్ రెడ్డి పంచుతున్నాడని తెలిపారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. KTR