KTR Slams Revanth Reddy: వికారాబాద్‌లో జరిగిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, ఈ చర్యను రాజకీయ కక్షతో కూడినదిగా అభివర్ణించారు. తన ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఈ సంఘటనను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ, బీఆర్‌ఎస్ పార్టీని అభాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
KTR Slams Revanth Reddy Over Vikarabad Incident
ముఖ్యంగా బీఅరెస్ నేతలపై రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా విమర్శిస్తూ, వికారాబాద్‌లో జరిగిన ఈ సంఘటన బీఆర్‌ఎస్‌ను అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ప్రజా ప్రతినిధుల అరెస్టుతో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని, ఇది ప్రజాస్వామిక హక్కులపై దాడి అంటూ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉంటుందని, అలాంటి హక్కులను కాలరాస్తున్నారని కేటీఆర్ తన వ్యాఖ్యల్లో పేర్కొన్నారు.
Also Read: Bollywood: తల్లి ఎదుటే స్టార్ హీరోయిన్ లిప్ కిస్ సీన్.. ఏకంగా 47 టేకులు.. 3 రోజులు!!
ప్రభుత్వం ప్రజా ప్రతినిధులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఈ తీరులో ప్రజాస్వామ్య విలువలను రక్షించే క్రమంలో ప్రభుత్వ విధానాలు వ్యతిరేకమవుతున్నాయని స్పష్టం చేశారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు, ప్రభుత్వ కుట్రకు సంకేతమని, ఇది దిగజారుడు రాజకీయాలకు ఉదాహరణగా పేర్కొన్నారు. అరెస్టులతో ప్రజలను, ప్రతినిధులను భయపెట్టాలని చూస్తున్న ప్రభుత్వం ఈ చర్యలు ప్రజాస్వామిక విలువలకు విరుద్ధమని కేటీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ ప్రజల కోసం పోరాడుతుందని, ఇలాంటి అక్రమ చర్యల ముందు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. పార్టీని అణచివేయాలనే ప్రయత్నాలు విఫలమవుతాయని, ప్రజలు ఎప్పుడూ తమతోనే ఉంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం మీద, వికారాబాద్ ఘటన రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. ఈ ఘటనపై బీఆర్‌ఎస్ మరియు ఇతర పార్టీల మధ్య విమర్శలు, వాదోపవాదాలు ముదురుతున్నాయి.