L2 Empuraan

L2: Empuran: 2019లో విడుదలైన మలయాళ బ్లాక్ బస్టర్ “లూసిఫర్” కు సీక్వెల్ గా “L2: ఎంపురాన్” వస్తోంది. ఈ చిత్రం మోహన్ లాల్ అభిమానులకు పండగలాంటిది, ఎందుకంటే ఆయన ఖురేషి అబ్రహం పాత్రలో మళ్లీ సందడి చేయబోతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పట్ల అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

L2: Empuran Release Date and First Look Revealed

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేసారు, ఇది అభిమానులను ఉర్రూతలూగించింది. ఇప్పుడు, పృథ్వీరాజ్ పుట్టినరోజు సందర్భంగా జయేద్ మసూద్ గా ఆయన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్, మోహన్ లాల్ కు రైట్ హ్యాండ్ గా నటిస్తున్నారు. మరియు ఆయన పాత్రను “ఎంపరర్ జనరల్”గా పరిచయం చేశారు. ఈ లుక్ ప్రేక్షకులను ఎంతో ఆకర్షిస్తోంది. మొదటి భాగంలో నటించిన టోవినో థామస్, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్ వంటి నటీనటులు ఈ సినిమాలో కూడా కనిపించనున్నారు.

Also Read : Rajinikanth: తగ్గిన రజనీకాంత్ నటించిన “వేట్టయన్ – ద హంటర్” టికెట్ ధరలు!!

“L2: ఎంపురాన్” చిత్రీకరణ భారీ స్థాయిలో జరుగుతోంది. లడఖ్, చెన్నై, కొట్టాయం, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి వివిధ ప్రాంతాలలో షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం తిరువనంతపురంలో షూటింగ్ కొనసాగుతోంది, మరియు త్వరలో గుజరాత్, యుఎఇ లలో కూడా షూటింగ్ జరగనుంది. ఈ సినిమా కోసం ప్రత్యేక సెట్స్ వేయనున్నారు. మరియు యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేక ఎఫెక్ట్స్ ను ఉపయోగిస్తున్నారు.

2025లో “L2: ఎంపురాన్” ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మలయాళం మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల చేయనున్నారు. సుజిత్ వాసుదేవ్ ఛాయాగ్రహణం మరియు దీపక్ దేవ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం, మోహన్ లాల్ మరియు పృథ్వీరాజ్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా. ఈ చిత్రం కూడా “లూసిఫర్” లాంటి భారీ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ట్రైలర్ విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.