Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు “లడ్డూ” అంశం ఎప్పుడూ కలిసిరావడం లేదనిపిస్తుంది. ఆయన లడ్డూ గురించి చేస్తున్న పోరాటం రాజకీయ వాతావరణంలో ఆయనకు ఇమేజ్‌ను పెంచే కన్నా, ఎక్కువగా డ్యామేజ్ చేసేలా ఉంటున్నాయి. పవన్ కి ఈ ఇష్యూ వల్ల రాజకీయాల్లో అనుకోని దెబ్బలు తగలడం ప్రారంభించిందనే చెప్పాలి.
Laddoo Remarks Haunt Pawan Kalyan Again in AP Politics
కొన్నేళ్ల క్రితం వెంకయ్య నాయుడిని ఉద్దేశించి “పాచిపోయిన లడ్డూ” అన్న పవన్ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ హాట్ టాపిక్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ ఆ మాటను ఉపయోగించలేదు, కానీ రాజకీయ ప్రత్యర్థులు ఆ పదాన్ని ఆయన్ను ఇరకాటంలో పెట్టడానికి తరచూ ఉపయోగిస్తున్నారు.
Also Read: Oviya: బిగ్ బాస్ బ్యూటీ ఓవియా కి బంపర్ ఆఫర్.. మాములు ఛాన్స్ పట్టలేదుగా!!
ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డూ అంశాన్ని మళ్లీ పవన్ టేకప్ చేసినప్పటికీ, ఈ సారి కూడా ఆయనకు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిగా పవన్ ఒక అంశాన్ని లేవనెత్తినప్పుడు, దాని ప్రభావాలు కూడా ముందుగా ఆలోచించి ముందడుగు వేయడం అవసరం. లేవనెత్తిన సమస్యకు సంబంధించిన ప్రశ్నలకు తనే సమాధానం ఇవ్వగలిగితే విమర్శలు తగ్గించుకోవచ్చు.
ఇప్పటి “లడ్డూ” ఎపిసోడ్‌లో పవన్ అండ్ కో ప్రస్తావించిన అంశాలపై పలువురు ప్రశ్నలతో చర్చలు నడుస్తున్నాయి. వాటికి సమాధానాలు ఇవ్వాలన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. ఈ దృష్ట్యా పవన్ లాంటి రాజకీయ నాయకుడు ఇలాంటివి టేకప్ చేసే ముందు మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం.