Lavanya Tripathi who gave good news to mega family on Dussehra

Lavanya Tripathi: మెగా ఫ్యామిలీలోకి నిజంగానే మరికొద్ది నెలల్లో ఓ బుల్లి వారసురాలో బుల్లి వారసుడో రాబోతున్నాడా.. దసరా పండుగ రోజు నిజంగానే మెగా ఫ్యామిలీకి లావణ్య త్రిపాఠి గుడ్ న్యూస్ చెప్పిందా అనేది ఇప్పుడు చూద్దాం.. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లయిన మూడు నెలల నుంచే ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Lavanya Tripathi who gave good news to mega family on Dussehra

లావణ్య త్రిపాఠి పెళ్లయ్యాక మూడు నెలలకే నెల తప్పిందని, మెగా ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్నాడని నాగబాబు ఆనందానికి అవధులులే లేవని ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.కానీ ఇన్ని రోజులైనా కూడా ఈ విషయం నిజమవడం లేదు.చాలా రోజులుగా లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ ఒక్కసారి కూడా ఈ హీరోయిన్ స్పందించలేదు.(Lavanya Tripathi)

Also Read: Nagarjuna: లవర్ కారణంగా టార్చర్ అనుభవించిన నాగార్జున..?

ఒకవేళ స్పందిస్తే ఈ వార్తలు మరింత ఎక్కువ అవుతాయి అనే ఉద్దేశంతోనే లావణ్య త్రిపాఠి వీటి పై స్పందించడం లేదని తెలుస్తోంది. అయితే తాజాగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. దసరా పండుగ రోజు మెగా ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులు అందరిని పిలిచి లావణ్య త్రిపాఠి గుడ్ న్యూస్ చెప్పిందని తెలుస్తోంది.

Lavanya Tripathi who gave good news to mega family on Dussehra

అయితే ఈ గుడ్ న్యూస్ ని పండగ రోజు చెబితే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే రెండు నెలలుగా ఈ గుడ్ న్యూస్ ని దాచి పెట్టేసి పండగ రోజు అందరినీ ఖుషి చేసినట్టు తెలుస్తోంది.మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పేరెంట్స్ కాబోతున్నారు అనే వార్త మాత్రం సినీ వర్గాల్లో జోరుగా చెక్కర్లు కొడుతుంది.(Lavanya Tripathi)