Lucky Bhaskar to Hit Screens with Special Diwali Premiere

Lucky Bhaskar: మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మలయాళంతోపాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ, విభిన్న భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్, తాజాగా ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు.

Lucky Bhaskar to Hit Screens with Special Diwali Premiere

ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలకు సిద్ధమైంది. విడుదలకు ముందే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీన్ని సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో చిత్రబృందం ఈరోజు సాయంత్రం 6 గంటలకు పెయిడ్ ప్రీమియర్ షోలు నిర్వహించనుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100 ప్రీమియర్ షోలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారని చిత్ర యూనిట్ పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో 50కి పైగా షోలు ప్రదర్శించనున్నట్లు సమాచారం.

Also Read: Uday Kiran: ఉదయ్ కిరణ్ చెల్లి ఓ స్టార్ సింగర్ అని మీకు తెలుసా..?

ప్రీమియర్ షోలకు టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయట, దీంతో ఈ సినిమాలోని ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని మరిన్ని షోలను కూడా యాడ్ చేయాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 100కి పైగా పెయిడ్ ప్రీమియర్ షోలు ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ ప్రీమియర్ షోల ద్వారా పాజిటివ్ టాక్ వచ్చినట్లయితే, సినిమా విడుదలైన రోజున భారీగా కలెక్షన్లు రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దుల్కర్ సల్మాన్ తన నటనకు ప్రధానత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ‘లక్కీ భాస్కర్’ కూడా అలాంటి ప్రయత్నమే అని తెలుస్తోంది. ఈ సినిమా అతని కెరీర్‌లో మరో విజయంగా నిలుస్తుందో లేదో తెలియాలంటే విడుదల తర్వాతి స్పందన చూడాలి.