Madhavi Latha: ఏపీ హోం మంత్రి అనిత చేసిన పనికి అటు విపక్షాల నుండి కాకుండా ఇటు హిందువుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటుంది. తాజాగా వినాయక చవితి సందర్భంగా కొలువైన వినాయక మండపాలకి వినాయకుడు ఎత్తుని బట్టి డబ్బులు కట్టాలని మండపాలకు డబ్బులు ఇవ్వాలని చలాన్లు రాయడంతో చాలామంది నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Madhavi Latha who played a bad game on the Home Minister
అంతేకాదు ఏపీలోని ఎంతోమంది విపక్షాలు కూడా ఈమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు. అయితే తాజాగా హోం మంత్రిపై నిప్పులు చెరిగింది హీరోయిన్ మాధవి లత.. బిజెపి పార్టీలో చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న మాధవిలత హిందువుల గురించి ఏమన్నా కూడా అస్సలు ఊరుకోదు.(Madhavi Latha)
అయితే తాజాగా హిందువుల పండుగ అయిన వినాయక చవితి సందర్భంగా చలాన్ లు కట్టాలి అంటూ హోం మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పు పట్టింది. హిందువులపై ఎందుకు ఈ వ్యతిరేకత..ఇదే మాటని ముస్లింల దగ్గరికి వెళ్లి క్రిస్టియన్ ల దగ్గరికి వెళ్లి అడగగలరా.. ఎందుకు హిందువులంటే అంత చిన్న చూపు.. ఒక హిందువుగా నేను ఈ విషయంలో అస్సలు సహించలేను..
హిందూ ధర్మాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే అస్సలు ఊరుకోను. అడుక్కుంటే చిల్లర పడేస్తాం కానీ ఇలాంటి నిబంధనలు మంచివి కావు అంటూ హీరోయిన్ మాధవి లత హోం మంత్రి అనిత పై షాకింగ్ కామెంట్లు చేసింది. ఇక మాధవి లత కామెంట్లతో సోషల్ మీడియా జనాలు హోం మంత్రిపై విరుచుకుపడుతున్నారు.(Madhavi Latha)
https://www.instagram.com/reel/C_oGykEsOZK/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==