Maharashtra Exit Poll Results 2024: మహారాష్ట్ర అలాగే ఝార్ఖండ్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు బుధవారంతో పూర్తి అయ్యాయి. దీంతో బుధవారం రోజున మహారాష్ట్ర అలాగే ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ రిజల్ట్ రిలీజ్ అయ్యాయి. ఈ ఎగ్జిట్ ఫలితాలు ప్రకారం… ఈ రెండు రాష్ట్రాల్లో బిజెపి పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకసారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు ఒకసారి పరిశీలిస్తే…మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. రిపబ్లిక్ పి మార్క్.. తమ సర్వే ఫలితాలను ప్రకటించింది. Maharashtra Exit Poll Results 2024
Maharashtra, jharkhand Exit Poll Results 2024
వీళ్ళ లెక్కల ప్రకారం బిజెపి కూటమికి 137 నుంచి 157 స్థానాలు వచ్చే ఛాన్స్. అదే సమయంలో కాంగ్రెస్ కూటమికి 126 నుంచి 146 సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇక ఇతరులు రెండు నుంచి 8 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉందట. మరో సర్వే మ్యాటర్ రైజ్ ప్రకారం బిజెపి కూటమికి 150 నుంచి 150 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందట. కాంగ్రెస్ కూటమికి 110 నుంచి 130 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే లెక్కలు తెలిపాయి. మరికొన్ని జాతీయ సంస్థలు అయితే బిజెపి కూటమికి 185 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తేల్చాయి. దీంతో మహారాష్ట్రలో బీజేపీ అధికారం రాబోతుందని వార్తలు వస్తున్నాయి. Maharashtra Exit Poll Results 2024
Also Read: Revanth Reddy: BRS పార్టీని తెలంగాణలో మొలకెత్తనివ్వను ?
ఇక జార్ఖండ్ ఎగ్జిట్ ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే… పీపుల్స్ పల్స్ ప్రకారం ఝార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలలో 46 నుంచి 58 బిజెపి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయట. అదే జె ఎం కు 24 నుంచి 37 అసెంబ్లీ స్థానాలు రాబోతున్నాయని సమాచారం.ఇతరులు ఆరు నుంచి పది స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయట. చాణక్య ప్రకారం జార్ఖండ్లో ఎన్డీఏ కూటమికి 45 నుంచి 50 స్థానాలు రాబోతున్నాయట. ఇక ఇండియా కూటమికి 35 నుంచి 38 స్థానాలు రానున్నాయట. అంటే జార్ఖండ్లో కూడా బిజెపి అధికారం లోకి రాబోతుందని సమాచారం. Maharashtra Exit Poll Results 2024