Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే మొదటి సినిమానే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన రాజకుమారుడు మూవీలో చేశారు.ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన నెలకొంది.
Mahesh Babu fire on director
అదేంటంటే..ఈ మూవీలో హీరోయిన్ గా చేసిన ప్రీతిజింతా తో మహేష్ బాబుకి కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి అయితే షూటింగ్లో భాగంగా మహేష్ బాబు ప్రీతిజింతా ఇద్దరు ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు వేసుకొని తాగే ఒక సన్నివేశం ఉంటుంది.(Mahesh Babu)
Also Read: Unni Mukundan: ప్రేక్షకులను అలరిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ “మార్కో” టీజర్!!
అయితే ఈ సన్నివేశం డైరెక్టర్ చెప్పిన సమయంలో మహేష్ బాబు కోపంతో ఊగిపోయి ఏంటి ఆ హీరోయిన్ తాగిన ఎంగిలి నేను తాగాలా..మీకు నేను ఎలా కనబడుతున్నాను అంటూ అక్కడి నుండి వెళ్లిపోయారట.ఆ తర్వాత మళ్లీ రాఘవేంద్రరావు ఫోన్ చేయడంతో సరదాగా అలా చేశాను మావయ్య అని చెప్పారట.
అయితే రాఘవేంద్ర రావుని మహేష్ బాబు మావయ్య అని పిలవడానికి కారణం చిన్నప్పటినుండి రాఘవేంద్ర రావుతో మహేష్ బాబుకి మంచి బాండింగ్ ఉందట. ఈ కారణంతోనే మహేష్ బాబు రాఘవేంద్రరావుని మామయ్య అని ప్రేమగా పిలుచుకునే వారట.(Mahesh Babu)