Kalki 2898AD: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం లో వచ్చిన కల్కి AD 2898 బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. భారీ తారాగణం మరియు భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం పాన్-ఇండియా గా సినిమా గా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను సృష్టింస్తుంది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించగా ఉత్తరాది, దక్షిణాది సెలబ్రిటీలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, శోభన, మాళవిక నాయర్, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి చాలా ముఖ్యమైన పాత్రలు పోషించారు.
Manas Character in Kalki 2898AD by Saswata Chatterjee
అయితే ఈ సినిమాలో కమాండర్ మానస్ పాత్రలో బాలీవుడ్ నటుడు సస్వతా ఛటర్జీ నటించారు. అయన గురించి తెలుగు వారికి చాలా తక్కువ తెలుసు. 1997 నుంచి సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్న ఆయన 2012లో సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన కహానీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. అతను అనేక బెంగాలీ మరియు హిందీ చిత్రాలలో నటించాడు. సస్వత ఛటర్జీ పలు హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించి ఇప్పుడు కల్కి చిత్రం ద్వారా దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. రావడమే ఓ కీలక పాత్ర లో నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.
Also Read: Rakul Preet Singh: డ్రగ్స్ కేసులో దొరికిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు..కెరీర్ ఖతమే!!
ఈ నేపథ్యంలో దర్శకుడు ఆయన మాట్లాడుతూ కల్కికి సినిమా కథ చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదని అన్నారు. ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడుకి కృతజ్ఞతలు అన్నరూ. ఇక నెటిజన్లు సస్వత ఛటర్జీ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. సస్వత ఛటర్జీని ఇండస్ట్రీలో సజ్జన్ అని పిలుస్తారు. బాలీవుడ్‌లోకి కూడా చాలా సినిమాలలో చేశాడు. కల్కి తర్వాత అయన కు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక అయన తన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా తెలియదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అతనిపై ఎలాంటి వివాదాలు లేవు. అతనికి భార్య మహువా చటోపాధ్యాయ మరియు కుమార్తె హియా చటోపాధ్యాయ. అయన ప్రేమ వివాహం చేసుకున్నాడు. నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఇక ఆయన కూతురు ప్రస్తుతం సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదువుతున్నట్లు సమాచారం. చదువుతో పాటు డ్యాన్స్‌పై కూడా ఆమెకు మక్కువ ఎక్కువ. ఆమె తన డ్యాన్స్ క్లిప్‌లను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమెకు సినిమా పరిశ్రమతో సంబంధం లేకపోయినా, ఆమె తన తండ్రితో కలిసి కొన్ని చిత్రాలకి పనిచేసింది.