Manchu Lakshmi: మంచు మోహన్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైలాగ్ కింగ్ గా.. కలెక్షన్ కింగ్ గా.. గుర్తింపు సంపాదించుకున్న హీరో. ఈయన కేవలం హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు నిర్మించారు. అయితే అలాంటి మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి తన ముగ్గురు పిల్లలు వచ్చారు. ఇద్దరు కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇస్తే కూతురు కూడా కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.అయితే మంచు లక్ష్మి లేటు వయసులో ఇండస్ట్రీకి వచ్చింది.
Manchu Lakshmi: My father is my biggest enemy
కానీ ఈమె హీరోయిన్ అవ్వాలని ఎన్నో కలలు కన్నదట.కానీ తన కలలన్నీ కలలుగానే మిగిలిపోవడానికి ప్రధాన కారణం తన తండ్రే అని, తన తండ్రి తన సినీ జీవితానికి పెద్ద శత్రువు అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిజినెస్ మాన్ సినిమాలో మహేష్ బాబు ముంబైని ఉచ్చ పోయించడానికి వచ్చినట్టు చెప్పే డైలాగ్ ప్రకారం లాగే నేను కూడా బాలీవుడ్ కి వెళ్లాలి అనుకున్నాను. (Manchu Lakshmi)
Also Read: Neha Shetty: అద్దానికి అతుక్కుపోయి మరి అందాలను ఆరబోస్తున్న రాధిక.. కెవ్వు కేక అంటున్న నెటిజన్స్..!
కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీ అస్సలు సపోర్ట్ చేయలేదు. ముఖ్యంగా నా తండ్రి బాలీవుడ్ కి వెళ్ళడానికి నిరాకరించాడు.ఇక ఆ టైంలో నా ఫ్రెండ్స్ అండ్ దగ్గుబాటి రానా వంటివాళ్లు నువ్వు బాలీవుడ్ వెళ్ళిపో అని సలహాలు ఇచ్చినప్పటికీ నా తండ్రి మాత్రం నేను వెళ్లడానికి ఒప్పుకోలేదు.ఒకరకంగా నేను పితృ సౌమ్య బాధితురాలిని అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఇక సౌత్ ఇండస్ట్రీ లో చాలామంది హీరోల కూతుర్లను, అక్కాచెల్లెళ్లను సినిమాల్లో హీరోయిన్ గా అస్సలు అంగీకరించరు.
వారిని సినిమాల్లో తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. నన్ను సినిమాల్లోకి ప్రకాష్ తీసుకువచ్చినప్పుడు మా నాన్న ప్రకాష్ వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. వాళ్ళు మా నిర్ణయాన్ని వ్యతిరేకించారు.కానీ పట్టుదలని విక్రమార్కుడిలా నేను సినిమాల్లోకి వచ్చాను. ఇక నా సోదరులు ఇండస్ట్రీలో ఫేమస్ అయినంత త్వరగా నేను ఫేమస్ అవ్వలేకపోయాను. నా స్టార్డం కోసం నేను ఇండస్ట్రీలో పోరాడాను అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. అలా తన సినీ కెరియర్ లో తన తండ్రి తనకు పెద్ద శత్రువు అంటూ మంచు లక్ష్మి చెప్పింది.(Manchu Lakshmi)