Maruti Fronx Velocity Edition: మన ఇండియన్ మార్కెట్లో అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఎవ్వరి చేతిలో అయినా టూవీలర్ లేదా ఫోర్ వీలర్ వాహనాలు ఉంటున్నాయి. దీనికి తగ్గట్టుగానే వాహనాల కంపెనీలు రకరకాల ఆఫర్లు పెట్టి… విక్రయాలు జరుపుతున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో దేశంలో పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు వంద రూపాయలకు పైగా పెరిగిపోయాయి. దీంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు.Maruti Fronx Velocity Edition
maruti suzuki fronx velocity edition price
అయితే ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త కారు వచ్చేసింది. మారుతి నుంచి ఫ్రాంక్స్ వెలాసిటీ ఎడిసన్ పేరుతో సరికొత్త కారు లాంచ్ అయింది. స్టాండర్డ్ ఫ్రాంక్స్ కారుతో పోలిస్తే ఇందులో కొత్త అప్డేట్లు ఇచ్చింది. ఇక ఈ కారు ధర 7.29 లక్షలు గా ఫిక్స్ చేసింది. ఇందులో అప్డేట్ వర్షన్ కార్లు ఎక్కువ ధరలు ఉంటాయి. Maruti Fronx Velocity Edition
Also Read: Redmi Note 13 Pro 5G: మరొక కొత్త కలర్లో రెడ్మీ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే..!
అయితే ఈ మారుతి సుజుకి.. వెలాసిటీ ఎడిషన్ కారు… రెండు ఆప్షన్లలో వచ్చింది. ఒకటి పెట్రోల్ రకమైతే మరొకటి పెట్రోల్- సిఎన్జి పవర్ ట్రైన్ ఆప్షన్ తో మారుతి సుజుకి మనకు అందిస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ టైప్స్ ఆఫ్ కార్స్ చాలానే వస్తున్నాయి. అందుకే సీఎన్జీ ఆప్షన్ కూడా ఇచ్చింది. Maruti Fronx Velocity Edition
ఇక ఇందులో 1.0 లీటర్ల టర్బో చార్జెడ్ ఇంజన్ మనకు అందిస్తున్నారు. 1.2 లీటర్ల నాచురల్ ఆస్పరిటేడ్ యూనిట్ కూడా కలిగి ఉంటుంది ఈ కారు. ఫ్యాక్టరీ ఫిట్టేడ్ సిఎన్జి కిట్ తో పాటు… 1.2 నాచురల్ ఆస్పరిటేడ్ ఇంజన్ కూడా… మనకు మారుతి సుజుకి అందిస్తోంది. Maruti Fronx Velocity Edition